Raghunandan Rao : రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించే రోజు దగ్గరపడింది

బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రైతులను కలిసేందుకు వెళ్లిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై టీఆర్ఎస్ దాడులు.. కేసీఆర్ భయానికి..

Raghunandan Rao : రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించే రోజు దగ్గరపడింది

Raghunandan Rao

Raghunandan Rao : బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రైతులను కలిసేందుకు వెళ్లిన తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై టీఆర్ఎస్ దాడులు.. కేసీఆర్ భయానికి నిదర్శనమన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. టీఆర్ఎస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. శాంతి భద్రతలను కాపాడటంలో కేసీఆర్ సర్కారు విఫలం అయ్యిందన్నారు. ఈ దాడులు పూర్తిగా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు.

రైతుల దగ్గరకి బీజేపీ నాయకులు వెళ్తే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోందని.. రైతులకు టీఆర్ఎస్ చేసిన మోసం, దగా పూర్తిగా అర్థం అయ్యిందని రఘునందన్ అన్నారు. టీఆర్ఎస్ వైఫల్యాల పై రైతులు, ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తిరగబడే రోజు ఆసన్నమైందన్నారు. రైతులకు చేసిన మోసాలకు కేసీఆర్ సర్కారు తగిన మూల్యం చెల్లించే రోజు దగ్గరపడిందని హెచ్చరించారు.

Read More : Wife Harassment : భార్య వేధింపులతో బ్యాంకు ఉద్యోగి బలవన్మరణం

”శాంతి భద్రతలను కాపాడటంలో కేసీఆర్ సర్కారు విఫలమైంది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వాహన శ్రేణిపై టీఆర్ఎస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ దాడులు పూర్తిగా కేసీఆర్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. రైతుల దగ్గరకి బీజేపీ నాయకులు వెళ్తే కేసీఆర్ వెన్నులో వణుకు పుడుతోంది. రైతులకు టీఆర్ఎస్ చేసిన మోసం, దగా పూర్తిగా అర్థం అయ్యింది. టీఆర్ఎస్ వైఫల్యాలపై రైతులు, ప్రజలు, బీజేపీ కార్యకర్తలు తిరగబడే రోజు ఆసన్నమైంది. రైతులకు చేసిన మోసాలకు కేసీఆర్ సర్కారు తగిన మూల్యం చెల్లించే రోజు ఆసన్నమైంది. పోలీసులు కేసీఆర్ సర్కారుకు భయపడి చేష్టలుడిగి చూస్తున్నారు.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బండి సంజయ్‌ పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సోమవారం ఉదయం నుంచి బండి సంజయ్‌ను అడుగడుగునా టీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి. సాయంత్రం చిల్లేపల్లి దగ్గర ఆయన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో బండి సంజయ్‌ కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. టీఆర్‌ఎస్‌, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

ఉద్రిక్తతల నడుమ అర్జాల బావిలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని బండి సంజయ్ పరిశీలించారు. రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటానన్న తెలంగాణ సర్కార్.. ఇప్పుడు ఎందుకు కొనడం లేదో చెప్పాలన్నారు బండి సంజయ్‌. కల్లాల్లోకే వచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కేసీఆర్‌ గతంలో చెప్పలేదా అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారని వాపోయారు. ఇప్పుడు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా…. ఆ నెపాన్ని కేంద్రం మీదకు నెడుతున్నారని ఫైర్‌ అయ్యారు. తక్షణమే రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని బండి సంజయ్ డిమాండ్‌ చేశారు.

Read More : Bride Escaped : కొద్ది గంటల్లో ముహూర్తం-పెళ్లి కూతురు అదృశ్యం

ధాన్యం కొనుగోళ్ల బాధ్యత మీదంటే మీదంటూ బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడంతో పాటు రాష్ట్రంలో ఆందోళనలు కూడా నిర్వహించాయి. టీఆర్ఎస్, బీజేపీ పోటాపోటీగా నిరసనలకు దిగాయి. ఇందుకు అదనంగా బీజేపీ మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం వరి ధాన్యం కొనుగోళ్లలో రైతుల ఇబ్బందులను పరిశీలించేందుకు జిల్లాల పర్యటనకు బండి సంజయ్ శ్రీకారం చుట్టారు. జిల్లాల రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు.

వరి ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తన వైఖరి స్పష్టం చేయాలంటూ టీఆర్ఎస్ డిమాండ్ చేస్తుండగా ప్రస్తుత వానకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే వరి కొనుగోళ్లపై వివాదం కొనసాగుతుండగా బండి సంజయ్ పర్యటన.. రాజకీయాల్లో మరింత హీట్ పెంచింది.