Etela rajender : కుట్రలు చేసినవారు కుట్రలతోనే నాశనమవుతారు : ఈటల భావోద్వేగం

హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో విజయం సాధించాక ఈటల రాజేందర్ తాజాగా మీడియాతో మాట్టాడుతు..తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

Etela rajender : కుట్రలు చేసినవారు కుట్రలతోనే నాశనమవుతారు : ఈటల భావోద్వేగం

Etela Rajender

Etela Rajender : హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో విజయం సాధించాక ఈటల రాజేందర్ తాజాగా మీడియాతో మాట్టాడుతు..తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రజల్ని ఎంతగా మభ్యపెట్టినా ఓటర్లు లొంగలేదని..ఈ విజయం హుజూరాబాద్ ప్రజల వియం అని..కేసీఆర్‌ అహంకారంపై ఇది తెలంగాణ ప్రజలు సాధించిన విజయమని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. అపజయం లేని ఈటల హుజూరాబాద్ లో మరోసారి విజయం సాధించాక మీడియాతో మాట్లాడుతు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. హుజూరాబాద్ ప్రజలకు తాను ఎంతో రుణపడి ఉంటానని..డబ్బుకు లొంగని నిజాయితీ హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలది అంటూ వ్యాఖ్యానించారు.

Read morr : Eetala Rajendar: హుజూరాబాద్ ప్రజలకు నా గెలుపు అంకితం!

ఇంకా ఈటల మాట్లాడుతు..హుజూరాబాద్ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ నేతలు వందల కోట్లు ఖర్చు పెట్టారు. డబ్బులు ఖర్చు పెట్టటమే కాకుండా ప్రజలను వేధింపులకు గురిచేశారు. భయభ్రాంతులకు గురి చేసి ఓట్లు దండుకోవాలని చూశారు. కానీ ప్రజలు ఏమాత్రం లొంగలేదు. ఇది హుజూరాబాద్‌ ప్రజల గొప్పతనం అని అన్నారు. హుజూరాబాద్‌లో ప్రజలు స్వేచ్ఛగా తిరగలేని పరిస్థితిని కల్పించి భయపెట్టారు. మద్యం ఏరులైపారించారు. పోలీసు ఎస్కార్టులో మద్యాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం అంతా తరలించారు. కోట్ల రూపాయల డబ్బులు వెదజల్లారు.ఎన్ని చేసినా ప్రజలు నా వైపు నిలబడ్డారు.కుల సంఘాలతో అందరికీ డబ్బులిచ్చారు.. అయినా ఎవరూ లొంగలేదని అన్నారు.

తాము ఎన్నికల ప్రచారంలో భాగంగా దళితుల బస్తీలకు వెళ్లినప్పుడు వారు..తనతో ‘దళిత బంధు ఇస్తే మాత్రం మేం లొంగిపోతామా బిడ్డా..పది లక్షలకు అమ్ముడుపోతామా బిడ్డా అని అన్నారని అది వారి నిజాయితీకి నిలువుద్దమని అన్నారు. కులాల ప్రస్తావనతో ప్రజల్ని వేరుచేసి ఓట్లు దండుకోవాలని టీఆర్ఎస్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని..ప్రజలు నా వైపే నిలబడ్డారని అన్నారు. నా ఈ విజయం హుజూరాబాద్ ప్రజలకు అంకితం. హుజూరాబాద్‌ ప్రజల రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేననీ..నా చర్మం ఒలిచి, వాళ్లకి చెప్పులు కుట్టించినా వారి రుణం తీర్చుకోలేనని ఈటల భావోద్వేగానికి గురయ్యారు. నియోజకవర్గ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుని వారి రుణం కొంతైనా తీర్చుకుంటానని అన్నారు.

Read morr : Huzurabad By Poll : అణచివేతపై రేపటినుంచే నా పోరాటం – ఈటల

ఎన్ని కుట్రలు చేసినా ప్రజల తీర్పుతో నాకు విజయాన్నిచ్చారు. కుట్రదారులు కుట్రలలోనే నాశనం అయిపోతారు. కుట్రలు ఎక్కువ కాలం నిలవవు. 2 గుంటల మనిషి 4 వందల కోట్ల డబ్బు ఎలా ఖర్చు పెట్టాడు?అంటూ ప్రశ్నించారు. నాకు అండగా నిలిచిన నియోజకవర్గ ప్రజలకునేను సర్వదా రుణపడి ఉంటాయని వారికి నా కృతజ్ఞతలు అని తెలిపారు.