Ganesh Immersion : ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్న గణనాథులు..భారీగా ట్రాఫిక్ జామ్

భాగ్యనగరంలో అన్ని దారులు సాగర్‌ వైపే సాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కోసం రాత్రి నుంచి భారీగా గణపయ్యలు తరలివస్తున్నారు. ట్యాంక్ బండ్ కు భారీగా గణనాథులు చేరుకుంటున్నాయి.

Ganesh Immersion : ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్న గణనాథులు..భారీగా ట్రాఫిక్ జామ్

Ganesh (2)

heavy traffic jam : భాగ్యనగరంలో అన్ని దారులు సాగర్‌ వైపే సాగుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం కోసం రాత్రి నుంచి భారీగా గణపయ్యలు తరలివస్తున్నారు. ట్యాంక్ బండ్ కు భారీగా గణనాథులు చేరుకుంటున్నాయి. ట్యాంక్‌బండ్‌ దగ్గర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్యాంక్‌ బండ్ వద్ద భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. గణేష్ నిమజ్జనాలను వీక్షించేందుకు నగర ప్రజలు ట్యాంక్ బండ్ కు భారీగా తరలివస్తున్నారు. ట్యాంక్‌ బండ్ పరిసరాలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హిమాయత్‌ నగర్‌, లిబర్టీ, లక్డీకాపూల్‌లో భారీగా ట్రాఫిక్‌ జామ్ అయింది. ట్యాంక్ బండ్‌ చుట్టూ వినాయక విగ్రహాలు బారులు తీరాయి.

తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న వినాయకుడు ఇవాళ గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు నిమజ్జనానికి ముమ్మర ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం కోసం తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శోభాయాత్ర జరిగే మార్గంలో అడుగడుగునా 4 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.

Ganesh Visarjan : బై బై గణేషా…గంగమ్మ ఒడికి గణనాథుడు

విగ్రహాల నిమజ్జనం కోసం ట్యాంక్‌బండ్‌ పరిసరాలలో 40 క్రేన్‌లు, గ్రేటర్‌లోని అన్ని చెరువులు, కుంటల వద్ద మొత్తం 320 క్రేన్‌లను అందుబాటులో ఉంచామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ప్రతీ కేన్‌ వద్ద ఒక పోలీసు అధికారిని నియమించడంతో పాటు ప్రతి విగ్రహం వెంట నిమజ్జన యాత్రలో ఒక అధికారి ఉండనున్నారు. నిమజ్జనం దృష్ట్యా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్‌ను మళ్లించారు. ట్యాంక్‌బండ్‌ పరిధిలో 32 మంది స్విమ్మర్లను సైతం అందుబాటులో ఉంచామని చెప్పారు.

విద్యుత్‌ సరఫరాకు అంతరాయం లేకుండా జనరేటర్లను సిద్ధంగా ఉంచనున్నట్లు తెలిపారు. ఇక హుస్సేన్‌ సాగర్‌ పరిధిలో 2, 600 లైట్లను ఏర్పాటు చేశామన్నారు. భక్తులకు తాగునీరు అందిచేందుకు 30 లక్షల వాటర్‌ ప్యాకెట్లను సిద్ధం చేయనున్నారు. అవసరమైన ప్రాంతాలకు వాటర్‌ ట్యాంకర్‌ల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకోనున్నారు. పారిశుద్ధ్య నిర్వహణకు 8 వేల 700 మంది సిబ్బంది మూడు షిఫ్ట్‌లలో నిరంతరం విధులు నిర్వహిస్తారు.

Tank Bund : గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర జరిగేది ఇలా

శోభాయాత్రలో లక్షలాది మంది పాల్గొనే అవకాశం ఉండడంతో ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరిగే విధంగా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 19 వేల మంది వివిధ స్థాయి పోలీస్‌ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. నిమజ్జనం సందర్భంగా భారీగా తరలిరానున్న భక్తజన సందోహం కోసం గ్రేటర్‌ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఉదయం నుంచి నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు 565 ప్రత్యేక బస్సులను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బస్సుల నిర్వహణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.