Generic Medical Store : శుభవార్త .. 100 మండలాల్లో జనరిక్ ఔషధ కేంద్రాలు

ప్రజలకు తక్కువ ధరకే ఔషదాలు అందించేందుకు జనరిక్ ఔషధ దుకాణాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే.. ఈ దుకాణాలు ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లోనే ఉన్నాయి.

Generic Medical Store : శుభవార్త .. 100 మండలాల్లో జనరిక్ ఔషధ కేంద్రాలు

Generic Medical Store

Generic Medical Store :  ప్రజలకు తక్కువ ధరకే ఔషదాలు అందించేందుకు జనరిక్ ఔషధ దుకాణాలు ఏర్పాటు చేసిన విషయం విదితమే.. ఈ దుకాణాలు ప్రస్తుతం పట్టణాలు, నగరాల్లోనే ఉన్నాయి. ఇక గ్రామీణ స్థాయికి వీటిని తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే దీనికి సంబందించిన ప్రణాలికను సిద్ధం చేసింది. తెలంగాణలో 500పైగా మండలాలు ఉండగా.. మొదటి దశలో 100 మండలాల్లో జనరిక్ ఔషధ దుకాణాలు తెరుచుకునున్నాయి. స్వయం సహాయక మహిళా సంఘాల ఆధ్వర్యంలో జనరిక్ ఔషధ దుకాణాలు ఏర్పాటు కానున్నాయి.

చదవండి :  వైద్య కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు.. కేంద్రం కీలక నిర్ణయం

వీటి ఏర్పాటు కోసం అవసరమైన రుణాన్ని అందించాలని స్త్రీనిధి సంస్థ నిర్ణయించింది. ఒక్కో దుకాణానికి రూ.5 లక్షల వరకు పెట్టుబడి అవసరం అవుతుందని లెక్కలు వేసింది. బీఫార్మసీ, ఎంఫార్మసీ చేసిన స్వయం సహాయక సంఘాల సభ్యులు లేదా కుటుంబసభ్యులు, వారి పిల్లలకు ఈ షాపులు ఏర్పాటుచేసుకొనే అవకాశం కల్పిస్తారు.

చదవండి :  మెడికల్ పరికరాల ధరలు తగ్గాయి!

ఇవి ఏర్పాటైతే మండల ప్రాంతంలోని ప్రజలకు మంచి మేలు జరుగుతుంది. ఔషదాలపై 30 నుంచి 80 శాతం వరకు డిస్కౌంట్ వస్తుంది. మెడికల్‌ షాపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉండటంతో ఉన్నతాధికారులతో స్త్రీనిధి సంస్థ సంప్రదింపులు జరిపింది. అధికారుల నుంచి సానుకూల స్పందన రావడంతో త్వరలో ఈ పథకానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది.