Huzurabad By Poll : పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, లీడ్‌‌లో టీఆర్ఎస్

హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఏర్పాటు చేసిన హాల్స్ లో ఓట్లను లెక్కించారు

Huzurabad By Poll : పోస్టల్ బ్యాలెట్ ఓట్లు, లీడ్‌‌లో టీఆర్ఎస్

Huzurabad Trs

TRS lead : హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ఏర్పాటు చేసిన హాల్స్ లో ఓట్లను లెక్కించారు అధికారులు. తొలుత పోస్టల బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. 822 పోస్టల్ బ్యాలెట్లకు గాను 753 ఓట్లు పోలయ్యాయి. 160 ఓట్ల అధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ముందంజలో నిలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ కు 503 ఓట్లు రాగా..బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు 159, కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరు వెంకట్ కు 32 ఓట్లు వచ్చాయి. అయితే..నోటాకు 14 ఓట్లు పోలవ్వడం విశేషం.

Read More : Counting Of Votes : హుజూరాబాద్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం.. మొదటగా పోస్టల్‌ బ్యాలెట్ కౌంటింగ్

గత ఎన్నికల్లో టీఆరెఎస్ కు 90 శాతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైన సంగతి తెలిసిందే. మరి కొద్దిసేపట్లో ఈ విషయాన్ని అధికారికంగా ఎన్నికల రిటర్నింగ్ అదికారులు ప్రకటించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించిన అనంతరం పోతిరెడ్డి పేటకు సంబంధించిన ఈవీఎంను తెరిచారు. ఒకటి నుంచి ఏడు రౌండ్ల వరకు లెక్కించనున్నారు. హుజురాబాద్ మండలం కీలకం కానుంది. మండలానికి సంబంధించి ఓట్ల లెక్కింపు అందరి దృష్టి నెలకొంది. రౌండ్ రౌండ్ కు ఉత్కంఠ మారే అవకాశం ఉంది.

Read More : Counting Of Votes : బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ ప్రారంభం

కరీంనగర్‌లోని కౌంటింగ్‌ కేంద్రమైన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజీలోకి ఉదయం ఆరు గంటల నుంచే అభ్యర్థులు, ఏజెంట్లను అధికారులు అనుమతించారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు కోసం రెండు హాళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్లో ఏడు టేబుల్స్ చొప్పున మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.  ఏకకాలంలో అన్ని టేబుళ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం 306 పోలింగ్ కేంద్రాల్లోని ఈవీఎంలలో పోలయిన ఓట్లను.. 22 రౌండ్లలో లెక్కించనున్నారు. ఒక్కో రౌండ్​కు 20 నుంచి 30 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఎక్కువ మంది అభ్యర్థులు ఉండటం వల్ల తుది ఫలితం ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.