Omicron Variant : ఒమిక్రాన్ ముప్పు.. తెలంగాణలో అర్థరాత్రి నుంచి ఆంక్షలు అమలు

ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విదేశాల నుంచి రాష్ట్రానికి..

Omicron Variant : ఒమిక్రాన్ ముప్పు.. తెలంగాణలో అర్థరాత్రి నుంచి ఆంక్షలు అమలు

Omicron Variant

Omicron Variant : నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్‌ ప్రజలను వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్‌ ను తలదన్నే.. ఒమిక్రాన్‌ అనే మరో కొత్త వేరియంట్‌ సౌతాఫ్రికాలో వెలుగు చూసింది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో ఈ ఒమిక్రాన్‌ యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది. సౌతాఫ్రికాలో పుట్టిన ఈ వేరియంట్ ఇప్పటికే 14 దేశాలకు వ్యాపించింది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో ప్రపంచానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని డబ్ల్యూహెచ్ఓ సైతం హెచ్చరించింది.

Sirivennela Sitaramasastri : ‘సిరివెన్నెల’ ఇకలేరు..

ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ముఖ్యంగా విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు పెట్టింది. ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన 12 దేశాల నుంచి తెలంగాణకు వచ్చే ప్రయాణికులపై ఈ అర్థరాత్రి నుంచి ఆంక్షలు విధిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.

”ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 12 దేశాలను ఎట్‌ రిస్క్‌ కంట్రీస్‌గా గుర్తించింది. ఆయా దేశాల నుంచి ప్రయాణికులందరికీ ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేస్తాం. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులను గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఐసోలేషన్‌ సెంటర్‌కు తరలించి, చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశాం. ఇప్పటి వరకు 12 రిస్క్‌ దేశాల నుంచి 41 మంది ప్రయాణికులు వచ్చారు. ఇందులో యూరప్‌ నుంచి 22 మంది, యూకే నుంచి 17 మంది, సింగపూర్‌ నుంచి ఇద్దరు రాగా.. వీరందరికీ ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేశామని, ఇందులో ఎవరికీ పాజిటివ్‌ రాలేదని” హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు.

RedRail : ఇకపై రైల్వేటిక్కెట్ల బుకింగ్ చాలా ఈజీ..ఐఆర్‌సీటీసీతో చేతులు కలిపిన RedBus

మరోవైపు ఇప్పటివరకు దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ కొత్త కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రవేశించ లేదని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాని ఆయన కోరారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరారు. ఎప్పుడైనా వేరియంట్‌ కేసు వచ్చినా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మీడియా ద్వారానే తెలియజేస్తుందన్నారు. ఇందులో ఎలాంటి దాపరికం కానీ, దాచాల్సిన అవసరం కానీ లేదన్నారు. ఎయిర్‌పోర్టుల్లో నిఘాను పెంచామని హెల్త్ డైరెక్టర్ వెల్లడించారు.