Girl Child: ఆడపిల్ల పుడితే గిఫ్ట్‌గా రూ. 10వేలు.. ఆదర్శగ్రామంలో సర్పంచ్ ప్రకటన

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని సొంత ఖర్చులతో అభివృద్ధి చేస్తున్న సర్పంచి అల్లం బాలిరెడ్డి సేవలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Girl Child: ఆడపిల్ల పుడితే గిఫ్ట్‌గా రూ. 10వేలు.. ఆదర్శగ్రామంలో సర్పంచ్ ప్రకటన

Sarpanch

Girl Child: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని సొంత ఖర్చులతో అభివృద్ధి చేస్తున్న సర్పంచి అల్లం బాలిరెడ్డి సేవలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశంలోనే ఆదర్శగ్రామంగా నిలిచిన వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం మరియపురం గ్రామ సర్పంచి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.

ఆడపిల్లకు జన్మనిస్తే రూ.10వేల కానుక ఇవ్వనున్నట్లు ప్రకటించారు సర్పంచి అల్లం బాలిరెడ్డి. సుకన్య సమృద్ధి యోజన కింద ఆడబిడ్డ పేరిట బ్యాంకులో ఈ మొత్తాన్ని డిపాజిట్‌ చేయనున్నట్లు వెల్లడించారు. నిర్మల ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌‌గా ఉన్న బాలిరెడ్డి.. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈమేరకు విషయాన్ని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

2019 ఫిబ్రవరిలో సర్పంచిగా పదవి చేపట్టిన నాటి నుంచి గ్రామంలో 8 మంది ఆడపిల్లలు జన్మించారని వారందరి పేరిట డబ్బు డిపాజిట్‌ చేయనున్నట్లు కూడా చెప్పారు. తాను పదవిలో ఉన్నంత వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని అన్నారు. ఈ నెల 20వ తేదీన నిర్మల ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బాలికల తల్లిదండ్రులకు డిపాజిట్‌ పత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు.

AP Assembly: ఆరు నెలల తర్వాత.. అసెంబ్లీ నేడే ప్రారంభం.. ఒక్కరోజే!

గతంలో గ్రామస్థుల సహకారంతో గ్రామంలో పలు అభివృద్ధి పనులను కూడా చేయించారు బాలిరెడ్డి. రూ.2లక్షలతో చేపట్టిన మినరల్‌వాటర్‌ ప్లాంట్‌, రూ.1.80 లక్షల విలువైన చెత్త సేకరణ ఆటో మొక్కలు పెంపకం.. డంపింగ్ యార్డులు.. ఇలా పలు కార్యక్రమాలను సొంతంగా నిర్వహించారు.

Maha Dharna: కేంద్రంపై యుద్ధం.. ఇందిరాపార్క్‌లో టీఆర్‌ఎస్‌ మహా ధర్నా నేడే!