Bandi Sanjay: పంట కొనేవరకు పోరాటం ఆపే ప్రసక్తేలేదు -బండి సంజయ్

వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనేంత వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.

Bandi Sanjay: పంట కొనేవరకు పోరాటం ఆపే ప్రసక్తేలేదు -బండి సంజయ్

Bandi Sanjay

Bandi Sanjay: వానాకాలం పంటను రాష్ట్ర ప్రభుత్వం కొనేంత వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. రాష్ట్రప్రభుత్వం పంట కొంటుందా.. కొనదా? సీఎం కేసీఆర్ స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు సంజయ్. వర్షాలకు వడ్లు తడిసిపోతే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు బండి సంజయ్‌.

తమపై రాళ్ళదాడి చేసినా, కోడిగుడ్లు వేసినా బరిస్తామని రైతుల పక్షాన పోరాడతామని చెప్పారు బండి సంజయ్. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో తమపై జరిగిన దాడిని ఖండించారు. అడుగడుగునా టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు అడ్డుకుంటూ ఉండడంతో జనగామకు వెళ్లలేదు బండి సంజయ్.. సూర్యాపేట జిల్లా తిరుమలగిరి నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరుకున్నారు.

బండి సంజయ్‌ రెండు రోజుల జిల్లాల పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం కనిపించింది. పలువురు తీవ్రంగా గాయపడగా.. పోలీసులు లాఠీచార్జ్ చేసి రెండు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఇక నల్గొండ పోలీసులు బండి సంజయ్‌పై కేసు నమోదు చేశారు.

Chicken or Egg?: కోడి ముందా? గుడ్డు ముందా? సైంటిస్ట్‌లు సమాధానం కనిపెట్టేశారు

ముందస్తు అనుమతి లేకుండా జిల్లాలో పర్యటించి.. ఉద్రిక్తతలకు కారణమయ్యారంటూ కేసు పెట్టారు. ఎమ్మెల్సీ కోడ్‌ వల్ల జిల్లాలో సభలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. మరోవైపు.. బండి సంజయ్‌ కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించి గవర్నర్ తమిళిసైకి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు.

Kuppam: కుప్పం కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. ప్రత్యేక అధికారిని నియమించిన హైకోర్టు