Huzurabad : రోటీ మేకర్.. కారు కొంపను ముంచనుందా ?

హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి కన్నా..స్వతంత్ర అభ్యర్థిగా అధికంగా ఓట్లు పోలు కావడం విశేషం.

Huzurabad : రోటీ మేకర్.. కారు కొంపను ముంచనుందా ?

Trs

Huzurabad By Poll 2021 : కారును పోలిన గుర్తే…సేమ్ కారు గుర్తులాగే కనిపిస్తోంది. ఎన్నికల్లో సేమ్ టు సేమ్ ఉన్న గుర్తులు తీవ్ర ప్రభావం చూపుతాయనే సంగతి తెలిసిందే. హుజూరాబాద్ లో అలాగే జరిగిందా ? అంటే ఎస్ అనిపిస్తోంది. ఎందుకంటే అచ్చం కారు గుర్తులాగే ఉన్న రోటీ మేకర్ సింబల్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిపై ఎఫెక్ట్ చూపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి కంటే…రోటీ మేకర్ సింబల్ కు అధికంగా ఓట్లు పడుతున్నాయి. రౌండ్ రౌండ్ కు అధికంగా ఓట్లు పోలవతుండడం టీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురి చేస్తోంది. 

Read More : Dwaraka Tirumala : ఇంటి వద్దే కారు ఉంది..అయినా..టోల్ ఫీజు కట్

హుజూరాబాద్ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 22 రౌండ్ల పాటు కౌంటింగ్ కొనసాగనుంది. కరీంనగర్ జిల్లాలోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఏడు టేబుళ్ల చొప్పున రెండు హాళ్లలో 14 టేబుళ్లపై ఓట్లను లెక్కిస్తున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ లెక్కించగా…ఇందులో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ అధిక్యంలో కొనసాగారు. అనంతరం ఈవీఎంలను తెరిచి..పోలైన ఓట్లను లెక్కించారు. మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో కొనసాగారు.

Read More : Corona Cases : దేశంలో కొత్తగా 10,423 కరోనా కేసులు, 443 మరణాలు

గెల్లు శ్రీనివాస్ కు 4 వేల 444 ఓట్లు వస్తే…ఈటల రాజేందర్ కు 4 వేల 610 ఓట్లు వచ్చాయి. అయితే..ఇక్కడ ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. స్వతంత్ర అభ్యర్థిగా నిలిచిన చిలువేరు శ్రీనివాస్ కు అనూహ్యంగా 122 ఓట్లు పడడం విశేషం. ఇతనికి రోటీ మేకర్ గుర్తును కేటాయించారు. కారు గుర్తును పోలినట్లుగా ఉండడంతో ఆయనకు ఓట్లు పడ్డాయని భావిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కు 119 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొదటి రౌండ్ లో ఇలా ఉంటే..మరిన్ని రౌండ్ లలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని టీఆర్ఎస్ శ్రేణులు చర్చించుకుంటున్నారు. రోటీ మేకర్ గుర్తు..ఎలాంటి ఎఫెక్ట్ పడనుందో..రానున్న రౌండ్ లలో చూడాలి.