Bathukamma : సద్దుల బతుకమ్మకు అంతా రెడీ.. ఈ ఏడాది రెండు రోజుల ముగింపు ఎందుకంటే..?

వృత్తిరీత్యా ఎక్కడెక్కడో ఉంటున్న కుటుంబసభ్యులంతా... ఒక్కింట చేరిపోయారు. సంప్రదాయం, అనుబంధం చాటుతూ... సద్దుల వేడుకలో పాల్గొంటున్నారు.

Bathukamma : సద్దుల బతుకమ్మకు అంతా రెడీ.. ఈ ఏడాది రెండు రోజుల ముగింపు ఎందుకంటే..?

Saddula Bathukamma

Saddula Bathukamma : తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబురాల జోరు అంబరాన్ని తాకుతోంది. తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మ వేడుకలకు ప్రతి గడప సిద్ధమైంది. వృత్తిరీత్యా ఎక్కడెక్కడో ఉంటున్న కుటుంబసభ్యులంతా… ఒక్కింట చేరిపోయారు. సంప్రదాయం, అనుబంధం చాటుతూ… సద్దుల వేడుకలో పాల్గొంటున్నారు.

ఎంగిలిపూల నుంచి సద్దుల వరకు

ఎంగిలిపూలతో మొదలై… సద్దులతో ముగుస్తుంటాయి బతుకమ్మ వేడుకలు. రెండోరోజు అటుకుల బతుకమ్మ, మూడోరోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగోరోజు నానబియ్యం బతుకమ్మ, ఐదోరోజు అట్ల బతుకమ్మ పేరుతో ఉయ్యాల పాటలతో… బతుకమ్మను కొలుస్తారు తెలంగాణ ఆడపడుచులు. ఆరోరోజు అర్రెం నాడు బతుకమ్మ ఆడరు. అలిగిన బతుకమ్మ అని కూడా చెబుతుంటారు. ఏడోరోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదో రోజు వెన్నముద్దల బతుకమ్మ తర్వాత.. తొమ్మిదోరోజు సద్దుల బతుకమ్మ ఆడతారు.

Chickpeas : శనగలు తినటం వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసా!…

సద్దుల బతుకమ్మ రోజున తెలంగాణ ఇళ్లు, వాకిళ్లలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. గునుగు, తంగేడు, చామంతి, బంతి, మందార, కనకాంబరం,  గులాబీ, పట్టుకుచ్చుల పువ్వులు సేకరిస్తారు. గుత్తులు కట్టి బతుకమ్మ పేరుస్తారు. దారంతో కట్టిన గునుగు పూల గుత్తులను రంగుల్లో అద్ది బతుకమ్మకు అందాలు అద్దుతారు. గుమ్మడి పువ్వు లేదా పసుపుతో గౌరమ్మను పెట్టి మంగళహారతులు, అగరుబత్తులు వెలిగించి కొలుస్తారు. సాయంకాలం బతుకమ్మ ఆటలు ఆడి పాటలు పాడి.. పోయిరావమ్మా బతుకమ్మ అంటూ సాగనంపుతారు.

ఈసారి సద్దులు రెండురోజులు 
తెలంగాణ రాష్ట్రమంతటా ఈసారి బుధ, గురు వారాల్లో సద్దుల బతుకమ్మ నిర్వహిస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో బుధవారం.. మరికొన్ని ప్రాంతాల్లో గురువారం చేస్తున్నారు. తెలంగాణ విద్వత్సభ, జ్యోతిష పండితులు, పూజారులు వేర్వేరు తేదీలు ప్రకటించడంతో… స్థానిక సంప్రదాయం ప్రకారం అదే పద్ధతిని జనం ఫాలో అవుతున్నారు. ఐతే… వేములవాడ, కొండపాక సహా.. పలు ప్రాంతాల్లో బతుకమ్మను 7 రోజులు, 11, 13 రోజులు ఆడే సంప్రదాయం కూడా ఉంది. ఐతే… ఎక్కువ మంది ప్రజలు మాత్రం ఏటా 9రోజులకే బతుకమ్మ వేడుకలను ముగిస్తారు.