Attack On Nuziveedu Police Station : కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళల దాడి

Attack On Nuziveedu Police Station : కట్టలు తెంచుకున్న ఆగ్రహం.. నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళల దాడి

Attack On Nuziveedu Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై దాడి జరిగింది. మహిళలు ఈ దాడికి దిగారు. ఓ కేసు విషయంలో పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు వచ్చిన మహిళలు.. లోనికి దూసుకెళ్లే యత్నం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీస్ స్టేషన్ పై వారు దాడి చేసినంత పని చేశారు.

తమ కూతురు కనిపించకపోవడానికి అల్లుడే కారణం అని అమ్మాయి తరపు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫిర్యాదు చేసిన మహిళ అల్లుడు రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని స్టేషన్ కు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న అమ్మాయి తరపు బంధువులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. రాజ్ కుమార్ ను తమకు అప్పగించాలని మహిళలు డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఒకానొక సమయంలో పోలీసులతో వారు వాగ్వాదానికి దిగారు. పోలీస్ స్టేషన్ పై దాడికి పాల్పడ్డారు. వారిని అదుపు చేయడానికి పోలీసులు అవస్థలు పడ్డారు.

Also Read..Wife Killed Husband : వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం.. భర్తకు విషం కలిపిన అన్నం ఇచ్చి చంపిన భార్య

నూజివీడు పోలీస్ స్టేషన్ పై ఫిర్యాదు దారులు దాడికి దిగడంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితుల దాడితో పోలీసులు స్టేషన్ తలుపులు మూసేయాల్సి వచ్చింది. పెళ్లైన 3 నెలలకే వరకట్నం కోసం వేధిస్తున్నారంటూ ఐశ్వర్య అనే వివాహిత తన భర్త రాజ్ కుమార్ పై ఫిర్యాదు చేసింది. అయితే, నిన్నటి నుంచి ఐశ్వర్య కనిపించకపోవటంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. వెంటనే స్పందించిన పోలీసులు.. రాజ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఐశ్వర్య కనిపించడం లేదని ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. ఈ వ్యవహారంలో రాజ్ కుమార్ తప్పేమీ లేదంటూ అతని కుటుంబసభ్యులు సైతం స్టేషన్ పైకి దాడికి పాల్పడ్డారు. ఆగ్రహంతో ఊగిపోతున్న మహిళలకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పుతున్నట్లు గ్రహించిన పోలీసులు.. స్టేషన్ గేట్లు మూసేశారు. తమ కుమార్తె జాడ చెప్పాలంటూ ఐశ్వర్య తల్లిదండ్రులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. వారితోపాటు వారి బంధువులు, గ్రామ ప్రజలు అక్కడికి చేరడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

Also Read.. Fake Baba Arrest : నగ్నంగా ఫోటోలు దిగితే ధనవంతులు అయిపోతారు..! పాతబస్తీలో గలీజు బాబా అరెస్ట్

మూడు నెలల క్రితమే ఐశ్వర్య, రాజ్ కుమార్ వివాహం జరిగింది. పెళ్లైన మూడు నెలలకే గొడవలు మొదలయ్యాయి. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడని ఐశ్వర్య ఆరోపించింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. దీంతో ఐశ్వర్య తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చెందారు. తమ కూతురు కనిపించకుండా పోవడానికి కారణం రాజ్ కుమార్ అని ఆరోపిస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.