రణరంగంగా షాద్ నగర్ : చంసేస్తామని ఆగ్రహంతో ఊగిపోతున్న జనాలు.. కంట్రోల్ చేయలేకపోతున్న పోలీసులు

షాద్ నగర్ లో హై టెన్షన్ నెలకొంది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిసరాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. నిందితులను చంపేయాలంటూ వేల సంఖ్యలో తరలివచ్చిన జనాలతో పీఎస్

  • Published By: veegamteam ,Published On : November 30, 2019 / 07:50 AM IST
రణరంగంగా షాద్ నగర్ : చంసేస్తామని ఆగ్రహంతో ఊగిపోతున్న జనాలు.. కంట్రోల్ చేయలేకపోతున్న పోలీసులు

షాద్ నగర్ లో హై టెన్షన్ నెలకొంది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిసరాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. నిందితులను చంపేయాలంటూ వేల సంఖ్యలో తరలివచ్చిన జనాలతో పీఎస్

షాద్ నగర్ లో హై టెన్షన్ నెలకొంది. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిసరాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. నిందితులను చంపేయాలంటూ వేల సంఖ్యలో తరలివచ్చిన జనాలతో పీఎస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్య కేసు నిందితులను తమకు అప్పగిచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వారిని మేమే చంపేస్తామని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పోలీస్ స్టేషన్ లోకి వెళ్లేందుకు జనం ప్రయత్నించారు.

వేలాదిగా తరలివచ్చిన జనాలను కంట్రోల్ చేయలేక పోలీసులు ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. పోలీస్ స్టేషన్ ముందు గుమికూడిన వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అయినా ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. ప్రియాంక హంతకులను చంపేస్తామని చెబుతున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనని పోలీసులు టెన్షన్ పడుతున్నారు.

మహబూబ్ నగర్ లోని కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు నిందితులను శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి షాద్ నగర్ పీఎస్ కి తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, ప్రజా సంఘాలు, విద్యార్థులు వేలాదిగా రోడ్డు ఎక్కారు. పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చారు. ప్రజలు సంయమనం పాటించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు సహకరించాలని కోరుతున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని, వారికి కఠిన శిక్ష పడేలా చూస్తామని హామీ ఇచ్చారు.