థాయ్ లాండ్ లో నరమేధం…ఉన్మాది కాల్పుల్లో 20మంది మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : February 8, 2020 / 10:52 PM IST
థాయ్ లాండ్ లో నరమేధం…ఉన్మాది కాల్పుల్లో 20మంది మృతి

థాయ్‌లాండ్‌లో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈశాన్య థాయ్‌లాండ్‌లోని కోరట్‌ సిటీలోని టెర్మినల్ 21 షాపింగ్ మాల్ లో శనివారం సాయంత్రం ఓ ఉన్మాది జరిపిన కాల్పుల్లో 20మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంద్రి తీవ్రంగా గాయపడ్డారు. తుపాకీ గుళ్ల వర్షంతో ఘటనాస్థలం యుద్ధభూమిని తలపించింది. మృతులు, క్షతగాత్రులతో భయానకంగా మారింది. మృతుల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండవచ్చని సమాచారం. కాల్పులకు తెగబడిన వ్యక్తిని ఆర్మీలో పనిచేసే సార్జెంట్‌ మేజర్‌ జక్రఫంత్ థోమాగా గుర్తించారు. 

నిందితుడు జక్రఫంత్ షాపింగ్‌ మాల్‌లోకి చొరబడి దాక్కున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన టెర్మినల్‌ 21 షాపింగ్‌ సెంటర్‌ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. నిందితున్ని పట్టుకునేందుకు అన్ని వైపులా బలగాలను మోహరించామని తెలిపారు.  పెద్ద సంఖ్యలో లైసెన్డ్స్‌ గన్‌లు కలిగిన ఉన్న దేశాల్లో ఒకటైన థాయ్‌లాండ్‌లో.. భద్రతా సిబ్బంది కాల్పులకు దిగడం అరుదు. 

అసలు శనివారం జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు

15:30: సుతమ్ ఫిథక్ మిలిటరీ క్యాంప్
దాడి ప్రారంభమమయింది. జక్రఫంత్ (32)…తన కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ అనంతరోట్ క్రాసే (48),అనంతరోట్ అత్త అనోంగ్ మిట్చన్(63)ను చంపాడు. హంవీ తరహా వాహనంలో క్యాంప్ నుండి పారిపోయే ముందు హెచ్‌కె 33 అటాల్ట్ రైఫిల్, మందుగుండు సామాగ్రి,మరికొన్ని ఆయుధాలను జక్రఫంత్ దొంగిలించాడు.

18:00: టెర్మినల్ 21 షాపింగ్ సెంటర్
కోరట్ సిటీలోని టోర్మినల్ 21 షాపింగ్ సెంటర్ దగ్గరకు జక్రఫంత్ వచ్చినట్లు ఫుటేజీ ద్వారా తెలిసింది. మాల్ లో ఉన్న ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఎటాక్ సమయంలో ఫేస్ బుక్ లో అప్ డేట్స్ పోస్ట్ చేశాడు జక్రఫంత్.

19:20: టెర్మినల్ 21,ఫోర్త్ ఫ్లోర్
షాపింగ్ సెంటర్ నాలుగో అంతస్తులో జక్రాఫాంత్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అతను లోపల బందీలను పట్టుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. విసిగిపోయాను, నేను నా వేళ్లను కదల్చలేను అంటూ జక్రఫంత్… ఫేస్ బుక్ లో రైఫిల్ పట్టుకున్న వీడియోను పోస్ట్ చేశాడు. షాపింగ్ సెంటర్ లోపల చిక్కుకున్న ప్రజలు బాత్రూమ్ క్యూబికల్స్, టేబుల్స్ కింద దాక్కున్నారు.

19:55: మొదటి మరణ సంఖ్య
10మందికి పైగా మరణించినట్లు రాయల్ థామ్ పోలీస్ అదనపు ప్రతినిధి కల్నల్ క్రిష్ణ కన్ఫర్మ్ చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు షాపింగ్ సెంటర్ ను చుట్టుముట్టారు, మరికొందరు భవనంలోకి ప్రవేశించి లోపల ఉన్నవారికి తప్పించుకోవడానికి సహాయం చేశారు. పోలీసు అధికారులు జక్రాఫాంత్ తల్లిని కలుసుకుని, ఆమెను షాపింగ్ సెంటర్‌కు తీసుకువచ్చారు, తద్వారా అతన్ని లొంగిపోయేలా ఒప్పించే ప్రయత్నం చేశారు.

21:20: మృతుల సంఖ్య పెరుగుదల
అధికారికంగా మృతి చెందినవారి సంఖ్య16కు చేరింది.

22:05: టెర్మినల్ 21లో ఎక్కువగా గన్ ఫైర్
షాపింగ్ సెంటర్ లోపల నుండి కాల్పులు మోత మరోసారి మోగింది.

22:50: జక్రఫంత్ ఫేస్‌బుక్ షట్ డౌన్
థాయ్ డిజిటల్ ఎకానమీ అండ్ సొసైటీ మంత్రిత్వ శాఖ… ఫేస్‌బుక్‌ను సంప్రదించి, జక్రఫంత్ ప్రొఫైల్‌ను మూసివేయమని కోరినట్లు చెప్పింది. థాయ్‌లాండ్‌లో జరిగిన ఈ విషాదం తమ హృదయాలను కలిచివేసిందని ఫేస్ బుక్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విధమైన దారుణానికి పాల్పడే వ్యక్తులకు ఫేస్‌బుక్‌లో చోటు లేదు, ఈ దాడిని ప్రశంసించడానికి లేదా మద్దతు ఇవ్వడానికి మేము ప్రజలను అనుమతించము అంటూ ఫేస్ బుక్ ఓ ప్రకటనలో తెలిపింది.
23:09: సైనిక సహాయం
షాపింగ్ సెంటర్ ను రక్షించడంలో పోలీసులకు సైనిక సహాయం చేస్తుందని, లోపల చిక్కుకున్న వ్యక్తులకు తప్పించుకోవడానికి సహాయం చేస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు.

23:35: టెర్మినల్ 21, గ్రౌండ్ ఫ్లోర్
షాపింగ్ సెంటర్ యొక్క గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఒకటి, రెండు మరియు మూడు అంతస్తులను క్లియర్ చేయగలిగామని అధికారులు నిర్ధారించారు. ప్రజలు పారిపోతున్నట్లు ఫొటోలలో కన్పించింది. తమ ఆపరేషన్స్ గురించి నిందితుడికి సమాచారం వెళ్లకుండా..దాడి లైవ్ కవరేజ్ ఆపేయాలని వార్తా సంస్థలను ఆర్మీ అధికారులు కోరారు. 

23:50: మరణాల సంఖ్య మళ్లీ పెరిగింది
మరణాల సంఖ్య 20 కి పెరిగిందని ఉప ప్రధాని అనుతిన్ చార్న్‌వెరాకుల్ ధృవీకరించారు. ఘటనా స్థలంలో 16 మంది మరణించగా, మరో నలుగురు హాస్పిటల్ లో మరణించారు. ఇద్దరు పోలీసు అధికారులకు వెనుక, కాలికి కాల్పులు జరిగాయని, ప్రస్తుతం వారికి సర్జరీ జరుగుతుందని ఆయన చెప్పారు.
9 ఫిబ్రవరి, 02:47: మరిన్ని తుపాకీ కాల్పులు
భవనం లోపల కాల్పులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. స్పెషల్ ఆపరేషన్ అధికారులు భవనంలోకి ప్రవేశించారు. అదే సమయంలో, గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఐదు అంబులెన్సులు షాపింగ్ సెంటర్ బయట రెడీగా ఉంచారు.

	th.JPG