Boy Suicide : మొబైల్ గేమ్స్‌ ఆడొద్దన్న తల్లి.. రైలు కింద పడి బాలుడు ఆత్మహత్య

దిండోషి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడు మొబైల్‌ ఫోన్‌లో అదే పనిగా గేమ్స్‌ ఆడుతున్నాడు. తల్లి మందలించి, బాలుడి నుంచి మొబైల్‌ ఫోన్‌ తీసుకుంది.

Boy Suicide : మొబైల్ గేమ్స్‌ ఆడొద్దన్న తల్లి.. రైలు కింద పడి బాలుడు ఆత్మహత్య

Suicide

boy suicide : మొబైల్‌ ఫోన్‌లో గేమ్స్‌ ఆడటం పిల్లలకు వ్యసనంగా మారిపోయింది. మొబైల్‌ గేమ్స్‌ పిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. తల్లిదండ్రులు మొబైల్‌ గేమ్స్‌ ను అడ్డుకున్నందుకు దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఓ బాలుడు ఏకంగా తల్లినే హత్య చేశాడు. తాజాగా మరో బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలో మొబైల్‌లో గేమ్స్‌ ఆడటాన్ని తల్లి అడ్డుకోవడంతో మనస్తాపం చెందిన బాలుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ముంబైలో చోటు చేసుకుంది.

దిండోషి పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడు మొబైల్‌ ఫోన్‌లో అదే పనిగా గేమ్స్‌ ఆడుతున్నాడు. తల్లి మందలించి, బాలుడి నుంచి మొబైల్‌ ఫోన్‌ తీసుకుంది. చదువుకోవాలని చెప్పి ఆమె బయటకు వెళ్లింది. ఫోన్ తీసుకోవడంతో మనస్తాపం చెందిన బాలుడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఇక తిరిగి రానని పేర్కొంటూ సూసైడ్‌ నోట్‌ రాశాడు.

boy suicide attempt: చదువుకోమన్నందుకు బాలుడు ఆత్మహత్యా యత్నం

అనంతరం బాలుడు రైలు పట్టాల వద్దకు వెళ్లాడు. వేగంగా వస్తున్న రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి తిరిగి వచ్చిన తల్లి, కుమారుడు రాసిన సూసైడ్‌ నోట్‌ చూసి ఆందోళన చెందింది. దీంతో ఆ కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మరోవైపు మలాడ్-కండివాలి స్టేషన్ల మధ్య ఒక బాలుడు రైలు కింద పడి చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అతడి కుటుంబాన్ని తీసుకుని అక్కడకు వెళ్లారు. మృతి చెందిన బాలుడు ఆ కుటుంబానికి చెందిన వాడేనని గుర్తించారు. ఈ ఘటనపై బోరివలి ప్రభుత్వ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.