Himachal Pradesh : హత్య కేసులో హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు చీఫ్ జస్టిస్ కుమార్తె అరెస్టు

సిద్ధూ హత్య జరిగిన ఏడేళ్ల తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సబీనా కుమార్తె కళ్యాణి సింగ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. 2016లోనే హంతకుడితో పాటు మహిళ ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది.

Himachal Pradesh : హత్య కేసులో హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు చీఫ్ జస్టిస్ కుమార్తె అరెస్టు

Ex-Bihar MLA

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి కుమార్తె కళ్యాణి సింగ్‌ను సీబీఐ బుధవారం అరెస్టు చేసింది. చండీగఢ్‌లో ఆరేళ్ల క్రితం జాతీయ స్థాయి సుఖ్‌మన్‌ప్రీత్ సింగ్ అలియాస్ సిప్పీ సిద్ధూ హత్య కేసులో కళ్యాణి సింగ్‌ను అరెస్టు చేసినట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు.

2015లో చండీగఢ్‌లోని ఓ పార్కులో సిప్పీ సిద్ధూని కాల్చి చంపారు. సిప్పీ సిద్ధూ జాతీయ స్థాయి షూటర్‌.. అలాగే కార్పోరేట్‌ లాయర్‌. పంజాబ్‌- హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టీస్‌ ఎస్ఎస్‌ సిద్ధూ మనవడు సిప్పీ సిద్ధూ.

Rahul Gandi: మూడో రోజు ముగిసిన రాహుల్ ఈడీ విచారణ.. మళ్లీ ఎప్పుడు వెళ్లాలంటే..

సిద్ధూ హత్య జరిగిన ఏడేళ్ల తర్వాత హిమాచల్‌ ప్రదేశ్‌ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి సబీనా కుమార్తె కళ్యాణి సింగ్‌ను సీబీఐ అరెస్టు చేసింది. 2016లోనే హంతకుడితో పాటు మహిళ ఉందని సీబీఐ అనుమానం వ్యక్తం చేసింది. ఈ కేసుకి సంబంధించి ఏదైన సమాచారం తెలిస్తే అందించాలంటూ రూ.5లక్షల రివార్డును సైతం ప్రకటించింది.

ఆ తర్వాత విచారణలో కళ్యాణి సింగ్‌ ప్రమేయం ఉందని తెలిసింది. కళ్యాణి సింగ్‌, సిద్ధూకు మధ్య సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఆమెను పరీక్షించి, అరెస్టు చేశారు. బుధవారం చండీగఢ్‌లోని స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచి, 4 రోజుల పోలీసు కస్టడీకి రిమాండ్ విధించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు.