Firing On Imran Khan : ‘ఇమ్రాన్ ఖాన్‌ని అందుకే చంపాల‌నుకున్నా’.. పోలీసుల విచారణలో వెల్లడించిన నిందితుడు

పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌పై తుపాకీతో హ‌త్యాయ‌త్నం చేసిన‌ వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు. ‘ఇమ్రాన్ ఖాన్ ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాడు. అందుక‌నే అత‌డిని చంపాల‌నుకున్నట్లు పేర్కొన్నారు.

Firing On Imran Khan : ‘ఇమ్రాన్ ఖాన్‌ని అందుకే చంపాల‌నుకున్నా’.. పోలీసుల విచారణలో వెల్లడించిన నిందితుడు

Pakistan's former pm Imran Khan

Firing On Imran Khan : పాకిస్తాన్ మాజీ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌పై తుపాకీతో హ‌త్యాయ‌త్నం చేసిన‌ వ్య‌క్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణలో నిందితుడు కీలక విషయాలు వెల్లడించాడు. ‘ఇమ్రాన్ ఖాన్ ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాడు. అందుక‌నే అత‌డిని చంపాల‌నుకున్నా. ఇమ్రాన్ ఒక్క‌డిని మాత్ర‌మే హ‌త్య చేయాల‌న్న‌ది నా ఉద్దేశం. ఇమ్రాన్ చేప‌ట్టిన ‘నిజ‌మైన స్వాతంత్రం’ యాత్ర లాహోర్‌ సిటీ దాట‌గానే అత‌డిని చంపాల‌ని నిర్ణ‌యం తీసుకున్నా. ఇక్క‌డికి నేను ఒక్క‌డినే బండి మీద వ‌చ్చాను. నా వెన‌క ఎవ‌రూ లేరు’ అని నిందితుడు వీడియోలో చెప్పాడు. ఇమ్రాన్‌ ఖాణ్ ను చంపాల‌నేది త‌న ఒక్క‌డి నిర్ణ‌య‌మే అని, త‌న వెన‌క ఎవ‌రూ లేరని చెప్పాడు.

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌‌పై గురువారం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్‌ గాయపడ్డారు. ఆయనతోపాటు మరో నలుగురికి కూడా గాయాలయ్యాయి. ఇమ్రాన్‌తోపాటు క్షతగాత్రుల్ని అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. పాకిస్తాన్, పంజాబ్ ప్రావిన్స్, వజీరాబాద్‌లోని జఫరలీ ఖాన్ చౌక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ‘రియల్ ఫ్రీడమ్’ పేరుతో ఇమ్రాన్ ఒక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక కంటైనర్ మౌంటెడ్ ట్రక్కుపై ఉండి ప్రసంగిస్తుండగా ఆయనపై దుండగులు కాల్పులు జరిపారు.

Imran Khan: ఇమ్రాన్ ఖాన్ ర్యాలీలో కాల్పులు.. ఇమ్రాన్ ఖాన్‌కు గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్‌ కాలికి గాయమైంది. వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది, గాయపడిన ఇమ్రాన్ ఖాన్‌ను కంటైనర్ నుంచి బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోకి మార్చారు. అనంతరం అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్‌కు అక్కడ చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటనలో ఆయన మేనేజర్‌తోపాటు ఇతర అనుచరులు కూడా గాయపడ్డారు.