Palamuru-Rangareddy Project: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రమాదానికి కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యమే కారణం!

కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యానికి ఐదుగురు కార్మికులు బలయ్యారు. మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రేమనగడ్డ వద్ద పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం జరిగింది. ప్యాకేజ్ వన్ పనులు చేసేందుకు గురువారం రాత్రి కార్మికులు.. క్రేన్‌ సాయంతో టన్నెల్‌కి దిగుతుండగా...క్రేన్‌ వైర్ తెగిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు.

Palamuru-Rangareddy Project: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ప్రమాదానికి కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యమే కారణం!

Palamuru-Rangareddy Project: కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యానికి ఐదుగురు కార్మికులు బలయ్యారు. మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతున్నారు. నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం రేమనగడ్డ వద్ద పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం జరిగింది. ప్యాకేజ్ వన్ పనులు చేసేందుకు గురువారం రాత్రి కార్మికులు.. క్రేన్‌ సాయంతో టన్నెల్‌కి దిగుతుండగా…క్రేన్‌ వైర్ తెగిపోయింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో నలుగురు జార్ఖండ్‌కు చెందిన వారు కాగా.. ఒకరు ఏపీలోని నిడదవోలుకు చెందిన వారుగా గుర్తించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో.. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు మృతదేహాలను గుట్టు చప్పుడు కాకుండా అర్థరాత్రే ఉస్మానియాకు తరలించారు.

పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టు సంస్థపై అనేక ఆరోపణలు ఉన్నాయి. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ఎక్కువగా బీహార్, రాజస్థాన్, అస్సాంతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన కూలీలు పనిచేస్తున్నారు. ఎక్కువమంది స్థానికులు కాకపోవడం.. ఉపాధి కోసం వలస వచ్చిన వారు కావడంతో.. కార్మికుల పట్ల సదరు సంస్థ నిర్దయగా వ్యవహరిస్తుందని స్థానికులు చెబుతున్నారు. కార్మికుల ప్రాణాలంటే ఆ సంస్థకు లెక్కే లేదంటున్నారు. ఇందుకు గతంలో జరిగిన ప్రమాదాలే ఉదాహరణగా చెబుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోయినా.. ఆ విషయం బయటకు రాదు అంటే.. కాంట్రాక్టు సంస్థ అధికారులను ఎంతగా మేనేజ్ చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. ప్రమాదం జరిగి ఎవరైనా ప్రాణాలు కోల్పోతే.. వెంటనే వారి కుటుంబ సభ్యులను పిలిపించడం.. వారికి ఎంతో కొంత ఇచ్చి పంపించి వేస్తారనే ప్రచారం ఉంది.

Nagar Kurnool : పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం..క్రేన్ వైర్ తెగిపడి ఐదుగురు కూలీలు మృతి

గురువారం రాత్రి జరిగిన ప్రమాదాన్ని కాంట్రాక్టు సంస్థ.. అధికారులు గోప్యంగా ఉంచారు. గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే ఉస్మానియా ఆస్పత్రికి తరలించడం చూస్తే అధికారులను ఏ స్థాయిలో మేనేజ్ చేస్తున్నారో అర్ధం అవుతోంది. చట్టాలను కూడా కాంట్రాక్ట్ సంస్థ ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మైనర్లను పనిలో పెట్టుకోకూడని చట్టం చెబుతున్నా.. కార్మికుల్లో మైనర్లూ ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయిన వారిలో కొందరు మైనర్లు ఉన్నట్లు కార్మికులు చెబుతున్నారు. అయితే ఇన్నాళ్లూ సదరు సంస్థ అరాచకాలను భరిస్తూ వచ్చిన కార్మికులు.. తాజాగా ఐదుగురు చనిపోవడం, మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఉండండతో.. ఆందోళన చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది.

అయితే జరగబోయే ప్రమాదాన్ని ముందే పసిగట్టిన కాంట్రాక్టు సంస్థ.. మృతుల బంధువులతో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. ఎంత పరిహారం ఇస్తారనేది కూడా బయటకు ప్రకటించలేదు. అలాగే మృతుల కుటుంబ సభ్యులు ఎవరితోనూ మాట్లాడకుండా కాంట్రాక్టు సంస్ధ బెదిరింపులకు పాల్పడినట్లు తోటి కార్మికులు చెబుతున్నారు. అలాగే కార్మికులెవరూ బయట ఉండకుండా.. ఉన్నపళంగా పనులకు హాజరు కావాలని ఆదేశించింది. పనిలోకి రానివారు వెళ్లిపోవాల్సి వస్తుందని బెదిరించినట్లు తెలుస్తోంది. ఆందోళనలు చేస్తే ఉపాధి లేకుండా చేస్తామని హెచ్చరించినట్లు కొందరు కార్మికులు ఆరోపిస్తున్నారు.