Umesh Murder : ఉమేశ్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

గత నెల 21న రాత్రి 10 గంటల సమయంలో మెడికల్ షాప్‌ మూసివేసి...ఇంటికి సమీపంలో కారు పార్క్‌ చేసి వెళ్తున్న ఉమేష్‌ను బైక్‌పై వెంటాడి దారుణంగా హత్య చేశారు. అతని గొంతుకోసి పరారయ్యారు.

Umesh Murder : ఉమేశ్ హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

Umesh

Umesh murder case : మహారాష్ట్ర అమరావతిలో ఉమేశ్ హత్య కేసులో ఏడుగురు నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ప్రధాన నిందితుడు ఇర్ఫాన్ సహా ఏడుగురిని అరెస్ట్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇర్ఫాన్‌ ఖాన్‌ అనే వ్యక్తి ఒకరు…ఉమేష్‌ను చంపితే 10 వేలు ఇస్తానంటూ ఆ కూలీలను ప్రలోభపెట్టాడని గుర్తించారు. ఉదయ్‌పూర్‌లో టైలర్ కన్హయ్య లాల్ హత్య తర్వాత నుపుర్ శర్మకు మద్దతు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు ఉమేశ్‌ను హత్య చేసినట్టు తేల్చారు.

గత నెల 21న రాత్రి 10 గంటల సమయంలో మెడికల్ షాప్‌ మూసివేసి…ఇంటికి సమీపంలో కారు పార్క్‌ చేసి వెళ్తున్న ఉమేష్‌ను బైక్‌పై వెంటాడి దారుణంగా హత్య చేశారు. అతని గొంతుకోసి పరారయ్యారు. ఈ కేసులో మహారాష్ట్ర యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ ఉగ్రవాద కోణంలో దర్యాప్తు చేపట్టింది. అయితే నిన్న కేంద్రం ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించింది. దీంతో కన్హయ్య లాల్‌ కేసుతో పాటు ఉమేశ్‌ కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది.

Nupur Sharma : నుపుర్‌ శర్మపై లుక్‌ అవుట్‌ సర్క్యులర్‌

మరోవైపు కన్నయ్య లాల్‌ను హత్య చేయడంతో నిందితులిద్దరూ విఫలమైతే..ఆ పని పూర్తి చేసేందుకు మరో ఇద్దరు సిద్ధంగా ఉన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. కన్నయ్యను హత్య చేయడంలో రియాజ్ అఖ్తరి, గౌస్ మహమ్మద్‌ విఫలమైతే… మరో ఇద్దరు నిందితులు మోసిన్, అసిఫ్‌ సిద్ధంగా ఉన్నట్లు తేల్చారు. హంతకులు పరారయ్యేందుకు వీరిద్దరు సాయం చేసినట్టు NIA గుర్తించింది. ఇక వీరు మరికొంత మంది బీజేపీ నేతలను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. కొంతమంది ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించినట్టు అధికారులు చెప్తున్నారు.