Satvik Case Remand Report : సాత్విక్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే చనిపోయాడని వెల్లడి

శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే సాత్విక్ చనిపోయాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాత్విక్ ను బూతులు తిట్టడంతో మనస్తాపం చెందాడని పోలీసులు తెలిపారు.

Satvik Case Remand Report : సాత్విక్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే చనిపోయాడని వెల్లడి

satvik (2)

Satvik Case Remand Report : శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ కేసు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే సాత్విక్ చనిపోయాడని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాత్విక్ ను బూతులు తిట్టడంతో మనస్తాపం చెందాడని పోలీసులు తెలిపారు. తోటి విద్యార్థుల ముందు పదే పదే కొట్టడం వల్ల సాత్విక్ కుంగిపోయాడని చెప్పారు. ఆచార్యతోపాటు ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి తరచుగా సాత్విక్ ను తిట్టారని తెలిపారు. చనిపోయే రోజు పేరెంట్స్ వచ్చి వెళ్లిన తర్వాత సాత్విక్ ను ఆచార్య, కృష్ణారెడ్డి చితకబాదారని చెప్పారు.

ఇంట్లో వారిని కూడా తిడుతూ ఆచార్య, కృష్ణారెడ్డి మాట్లాడారని పేర్కొన్నారు. అటూ హాస్టల్ లోనూ సాత్విక్ ను వార్డెన్ వేధించాడని పోలీసులు చెప్పారు. శ్రీ చైనత్య కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్టియర్ చదువుతున్న స్వాతిక్ ఆత్మహత్య కేసులో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ నలుగురి రిమాండ్ రిపోర్టులో కొన్ని కీలకమైన అంశాలను పోలీసులు ప్రస్తావించారు. ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ ఆచార్య, క్యాంపప్ ఇంచార్జ్ గా ఉన్న శోభన్, నరేశ్ చిత్ర హింసలకు గురి చేయడంతోనే సాత్విక్ మనస్తాపానికి గురైన చనిపోయినట్లు పోలీసులు రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు.

Sathwik Case : శ్రీ చైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ సూసైడ్‌తో కదిలిన విద్యాశాఖ

ఇప్పటికే సాత్విక్ సూసైడ్ పై ప్రాథమిక రిపోర్టును ఎంక్వైరీ కమిటీ ప్రభుత్వానికి కమిటీ అందజేసింది. కాలేజీలో కనీస ప్రమాణాలు లోపించాయని, కాలేజీలో వేధింపులు జరిగిన మాట వాస్తవమేనని కమిటీ తేల్చింది. సాత్విక్ అడ్మిషన్ శ్రీ చైతన్య కాలేజీలో లేదని మరో కాలేజీలో అడ్మిషన్ తీసుకుని సాత్విక్ ఇక్కడ చదువుతున్నట్లుగా గుర్తించింది. దాదాపు అన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇదే బాగోతం నడుస్తున్నట్లు తెలిపింది. శ్రీ చైతన్య క్లాసులు, చిన్న కాలేజీల పేరుతో సర్టిఫికేట్స్ ఇస్తున్నారని ఈ నివేదికలో పేర్కొంది.

ఇక ర్యాంగింగ్ ఇష్యూపై ఇంకా విచారణ చేయాల్సివుందని కమిటీ తెలిపింది. అడ్మిషన్స్ విషయంపై అన్ని కాలేజీల్లోనూ చెక్ చేయాలని కమిటీ సూచించింది. అధికారులు పాత విషయాలనే మళ్లీ రిపోర్టులో ప్రస్తావించారు. ఇంటర్ విద్యార్థి సాత్విక్(16) ఆత్మహత్య కేసులో నలుగురు నిందితులకు ఉప్పర్ పల్లి కోర్టు రిమాండ్ విధించింది. నిందితులు ఆచార్య(అడ్మిన్ ప్రిన్సిపాల్), నరేశ్(క్యాంపస్ ఇంచార్జి), కృష్ణారెడ్డి(ప్రిన్సిపాల్), శోభన్(వార్డెన్)కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆ నలుగురు నిందితులను పోలీసులు చర్లపల్లి జైలుకి తరలించారు.

Satvik Case : సాత్విక్ సూసైడ్ లెటర్ లో పలు కీలక అంశాలు.. వీరి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఆవేదన

నార్సింగిలోని శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థి సాత్విక్‌ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. గత మంగళవారం రాత్రి క్లాస్‌ రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే సాత్విక్‌ మృతి చెందినట్టు డాక్టర్లు నిర్ధారించారు. మరోవైపు తోటి విద్యార్థులు సైతం కాలేజీ యాజమాన్యం ఒత్తిడి వల్లే సాత్విక్‌ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా చెబుతున్నారు.

కాలేజీ హాస్టల్‌ నుంచి సాత్విక్‌ సామగ్రిని తీసుకుంటున్న సమయంలో అతడి దుస్తుల మధ్య సూసైడ్‌ నోట్‌ బయటపడింది. అందులో ప్రిన్సిపాల్‌ కృష్ణారెడ్డి, అడ్మిన్‌ ప్రిన్సిపాల్‌ ఆచార్య, శోభన్, క్యాంపస్‌ ఇన్‌చార్జి నరేశ్‌ల వేధింపులు భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు సాత్విక్‌ రాశాడు. తనతోపాటు తన మిత్రులకు కూడా ఆ నలుగురు నరకం చూపిస్తున్నారని, వారిపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకోవాలని కోరాడు.

Inter Student Sathwik Case : ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్య కేసు.. ఆ నలుగురికి రిమాండ్

‘‘అమ్మ, నాన్న, అన్న.. ఈ పని చేస్తున్నందుకు నన్ను క్షమించండి. మిమ్మల్ని బాధపెట్టాలని కాదు. కాలేజీలో పెట్టే మెంటల్‌ టార్చర్, వాళ్లు చూపే నరకాన్ని భరించలేకనే ఈ చెడ్డ పని చేస్తున్నా. మిస్‌ యూ. మీ అందరినీ బాధపెడుతున్నందుకు సారీ.. నన్ను క్షమించండి, నా కోసం మీరు బాధపడితే నా ఆత్మ శాంతించదు. మీరు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. అమ్మా, నాన్నకు నేను లేని లోటు రాకుండా చూసుకో అన్నా..’’అని సాత్విక్ సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నాడు.