Young Man Cheating : ప్రేమను నిరాకరించిందని పోలీసులకు పట్టించాడు..చివరికి కటకటాలపాలయ్యాడు

ప్రేమను నిరాకరించన్న కోపంతో యువతిపై కక్ష సాధింపుకు పాల్పడ్డాడు ఓ యువకుడు. గిఫ్ట్ పేరుతో గంజాయి ప్యాకెట్ ఇచ్చి యువతిని పోలీసులకు పట్టించాడు. గంజాయి కేసులో ఇరికించే ప్రయత్నం చేశాడు.

Young Man Cheating : ప్రేమను నిరాకరించిందని పోలీసులకు పట్టించాడు..చివరికి కటకటాలపాలయ్యాడు

Young Man

marijuana as a gift to young woman : ప్రేమను నిరాకరించన్న కోపంతో యువతిపై కక్ష సాధింపు చర్యకు పాల్పడ్డాడు ఓ యువకుడు. బహుమతి పేరుతో గంజాయి ప్యాకెట్ ఇచ్చి యువతిని పోలీసులకు పట్టించాడు. గంజాయి కేసులో ఇరికించే ప్రయత్నం చేశాడు. కానీ చివరకు అతనే కటకటాలపాలయ్యాడు.

పోలీసుల కథనం ప్రకారం.. విశాఖకు చెందిన వినయ్ కుమార్ (25) ప్రైవేట్ కంపెనీలో డేటా ఎంట్రీ ఉద్యోగిగా పని చేస్తున్నారు. తనతోపాటు చదువుతున్న అదే ప్రాంతానికి చెందిన యువతికి ప్రేమిస్తున్నానని చెప్పగా అందుకు ఆమె నిరాకరించారు. దీంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఆమెపై కక్ష తీర్చుకోవాలని కుట్ర పన్నాడు.

Bangladesh Violence: సేవ్ హిందు నినాదాలతో హోరెత్తిన బంగ్లాదేశ్.. హింసకు కారకుడతనే.. అరెస్ట్!

ఈవెంట్స్ నిర్వహకురాలైన యువతి మరో ఇద్దరు స్నేహితులరాళ్లతో కలిసి (మే 13, 2018)న షిర్డీసాయి ఎక్స్ ప్రెస్ లో సికింద్రాబాద్ కు బయల్దేరారు. ఇది తెలుసుకుని వచ్చిన యువకుడు స్నేహానికి గుర్తుగా గిఫ్ట్ అని నమ్మించి 3 కిలోల గంజాయి ప్యాకెట్ ఇచ్చాడు. మరునాడు రైలు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకునే ముందే యువతి గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నట్లు జీఆర్సీ అధికారులకు యువకుడు సమాచారం అందించారు.

రైలు స్టేషన్ కు రాగానే పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. స్నేహితుడినంటూ గిఫ్ట్ ప్యాకెట్ రూపంలో గంజాయి ఇచ్చి యువతిని మోసం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారం ఆ యువతిని విడిచిపెట్టారు.

Illegal Affair : వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య

వినయ్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతను పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే కేసు ఏమీ లేదని, కేవలం సమాచారం కోసం మాట్లాడాల్సివుందని జీఆర్సీ అధికారులు పిలిపించగా గురువారం స్టేషన్ కు వచ్చాడు. విచారణలో గంజాయిని గిఫ్ట్ ప్యాకెట్ రూపంలో ఇచ్చింది తానేనని ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.