తాగి పంపకాల పంచాయతీ: ఓ ఫ్రెండ్ మర్డర్!

ఇద్దరు స్నేహితులు కలిసి బార్ లో ఫుల్ గా మందు కొట్టారు. తరువాత మెల్లగా లేచి పడుతూ లేస్తూ ఇంటి బాట పట్టారు. ఇంతలో పక్క ఫ్రెండ్ కు ఓ పెద్ద డౌట్ వచ్చింది. అరే.. నువ్వు మందు తాగడానికి ఎంత ఖర్చు పెట్టావో చెప్పరా?. అరే.. నువ్వెంత ఎంతో పెట్టావో చెప్పరా ముందు అన్నాడు మరొకడు. లేదు..

  • Edited By: sreehari , January 5, 2019 / 10:44 AM IST
తాగి పంపకాల పంచాయతీ: ఓ ఫ్రెండ్ మర్డర్!

ఇద్దరు స్నేహితులు కలిసి బార్ లో ఫుల్ గా మందు కొట్టారు. తరువాత మెల్లగా లేచి పడుతూ లేస్తూ ఇంటి బాట పట్టారు. ఇంతలో పక్క ఫ్రెండ్ కు ఓ పెద్ద డౌట్ వచ్చింది. అరే.. నువ్వు మందు తాగడానికి ఎంత ఖర్చు పెట్టావో చెప్పరా?. అరే.. నువ్వెంత ఎంతో పెట్టావో చెప్పరా ముందు అన్నాడు మరొకడు. లేదు..

హైదరాబాద్: ఇద్దరు స్నేహితులు కలిసి బార్ లో ఫుల్ గా మందు కొట్టారు. తరువాత మెల్లగా లేచి పడుతూ లేస్తూ ఇంటి బాట పట్టారు. ఇంతలో పక్క ఫ్రెండ్ కు ఓ పెద్ద డౌట్ వచ్చింది. అరే.. నువ్వు మందు తాగడానికి ఎంత ఖర్చు పెట్టావో చెప్పరా?. అరే.. నువ్వెంత ఎంతో పెట్టావో చెప్పరా ముందు అన్నాడు మరొకడు. లేదు.. లేదు.. నువ్వే ముందు చెప్పు.. లేదురా.. నువ్వే ముందు చెప్పు.. అదిగో ఇక్కడ మొదలైంది ఇద్దరి మధ్య తాగుడు పంచాయతీ. మాట మాట పెరిగింది. పక్కనే రాయి కనిపించింది. అంతే.. తలపై రాయితో గట్టిగా మోదాడో ఫ్రెండ్. రక్తపు మడుగులో పడి తోటి స్నేహితుడు ప్రాణాలు కోల్పోయాడు.

మద్యం మత్తులో తానేమి చేశాడో తెలియలేదు. పోలీసులు వచ్చి పట్టుకొనేసరికి అసలు విషయం బోధపడింది ఇతగాడికి.. ఈ ఘటన హైదరాబాద్ లోని జీడిమెట్లలో గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో చోటుచేసుకున్నట్టు పోలీసు అధికారి రమణారెడ్డి వెల్లడించారు. స్నేహితుల్లో మృతుడి పేరు నవీన్ గా గుర్తించిన పోలీసులు.. హత్య చేసింది భరత్ గా గుర్తించారు. మృతుడు నవీన్ పై గతంలోనే క్రైం రికార్డు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. హత్యచేసిన వ్యక్తి నేర చరిత్రపై ఆరా తీస్తున్నట్టు రమణారెడ్డి తెలిపారు.