Robbery : ఒకే గ్రామంలో ఒకే రోజు 15 ఇళ్లల్లో చోరీ

ఇళ్లల్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, నగదుతోపాటు విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్లారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు.

Robbery : ఒకే గ్రామంలో ఒకే రోజు 15 ఇళ్లల్లో చోరీ

Robbery

Robbery : యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని సింగారం గ్రామంలో భారీ చోరీ జరిగింది. ఆదివారం అర్ధరాత్రి ఒకేసారి 15 ఇళ్లల్లో దొంగతనం జరిగిందని గ్రామస్తులు తెలిపారు. సింగారం గ్రామ సమీపంలోని బేగంపేట, జాల గ్రామాల్లో దుర్గమ్మ పండుగ నిర్వహిస్తున్నారు.

పండుగ నేపథ్యంలో సింగారం గ్రామంలోని చాలా మంది బేగంపేట, జాలా గ్రామాల్లో ఉన్న తమ బంధువుల ఇళ్లకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేశారు. ఒకే గ్రామంలో ఏకంగా 15 ఇళ్ల తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.

Viral Video : ఓ మై గాడ్.. రెచ్చిపోయిన దొంగలు, క్షణాల్లో బైకులు చోరీ.. వీడియో వైరల్

ఇళ్లల్లో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, నగదుతోపాటు విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్లారని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాల ఫిర్యాదు మేరకు రాజపేట ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి కేసు నమోదు చేసుకుని. దర్యాప్తు చేపట్టారు.