Woman Murder : అప్పు తీర్చమన్నందుకు మహిళను హత్య చేసిన నిందితులు

 తీసుకున్న అప్పు తీర్చమని అప్పిచ్చిన మహిళ గట్టిగా అడగటంతో ఆమెను హత్యచేశారు ముగ్గురు నిందింతులు. హత్యను వేరొకరిపైకి నెట్టే ప్రయత్నం చేశారు.

Woman Murder : అప్పు తీర్చమన్నందుకు మహిళను హత్య చేసిన నిందితులు

Three People Killed A Woman

Woman Murder : తీసుకున్న అప్పు తీర్చమని అప్పిచ్చిన మహిళ గట్టిగా అడగటంతో ఆమెను హత్యచేశారు ముగ్గురు నిందింతులు. హత్యను వేరొకరిపైకి నెట్టే ప్రయత్నం చేశారు. అల్వాల్ పోలీసులు అందించిన సమాచారం ప్రకారం…… వెంకటాపురం లోతుకుంటలో నివసించే పూలమ్మ(40)దినసరి కూలీగా పని చేస్తుంది. భర్తనుంచి విడిపోయి ఒంటరిగా జీవిస్తోంది. జూన్ 25న ఆమె నిద్రిస్తున్న సమయంలో హత్యకు గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజీలు, అనుమానుతులను ప్రశ్నించటం చేశారు. అయినా నిందితుల ఆచూకి లభ్యం కాలేదు. అనుమానితులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ ఏరియాలో  నిఘా పెట్టి అసలు  నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

మృతురాలు పూలమ్మ దగ్గర సాయిలు(50) మంజుల (40) వినోద(49) లు అప్పు తీసుకున్నారు. ఇటీవల అప్పు తిరిగి చెల్లించమని పూలమ్మ వారిని ఒత్తిడి చేయసాగింది. ఆమె ఒత్తిడి తట్టుకోలేక ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ హత్య తమ మీదకు రాకుండా ప్లాన్ వేశారు.

గత నెల 25 న పూలమ్మకు సన్నిహితంగా ఉండే వ్యక్తి ఆమె ఇంటికి వచ్చివెళ్లటం చూశారు. అతను వెళ్లాక గుడిసె వెనుక నుంచి గునపంతో మంచంపై నిద్రిస్తున్న పూలమ్మ తలపై పొడవటంతో నిద్రలోనే పూలమమ్మ మరణించింది. హత్య చేసిన నిందితుడు సాయిలు వాళ్ల సొంత ఊరు వెళ్లిపోయాడు. మర్నాడు ఉదయం పూలమ్మ చనిపోయిందని విషయం తెలిసి పోలీసులు ఘటనా స్ధలానికి వచ్చి వివరాలు సేకరించారు. మృతదేహాన్ని ఆస్పత్రి మార్చురీకి పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కానీ పోలీసులకు ఆధారారాలు దొరకలేదు.  ఇంట్లో లోపల తలుపు గడియ వేసి ఉంది. పూలమ్మ మంచంపై నిద్రిస్తోంది. మంచంపై నిద్రిస్తున్న మనిషి హత్యకు గురైంది. హత్య స్ధలంలో ఎటువంటి ఆధారాలు లభించక పోవటంతో పోలీసులకు కేసు పెద్ద సవాల్ గా మారింది.  చివరకు పూలమ్మ ఇంటిపక్కనే ఉండే సాయిలు, మంజుల హత్య చేశారని తేలటంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేయటంతోటే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నిందితులను శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్ కు పంపారు.