టిక్ టాక్ స్టార్ రౌడీ బేబీ ఆత్మహత్యాయత్నం

టిక్ టాక్ స్టార్ రౌడీ బేబీ ఆత్మహత్యాయత్నం

టిక్ టాక్  సుబ్బలక్ష్మి అలియాస్ రౌడీ బేబీ సూర్య  సోమవారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. తమిళనాడులోని తిరుప్పూరు శబరి నగర్  చెందిన సుబ్బలక్ష్మి టిక్ టాక్ వీడియోలతో బాగా పాపులర్ అయ్యింది. తానోక పెద్ద హీరోయిన్ గా ఫీలయ్యేది.  ఇటీవలే ఒక యువకుడి ప్రేమలో పడి వార్తల్లోకెక్కింది. ఈమె చేసిన  వీడియోస్ చూసి సింగపూర్ కు చెందిన కొంతమంది ఔత్సాహికులు ఆమెను 3నెలల క్రితం  అక్కడకి ఆహ్వానించారు.

సింగపూర్ వెళ్లిన బేబీ వారితో ఆడి పాడి  వారిని ఫుల్ ఎంటర్టైన్ చేసింది. కానీ ఆమె వెళ్లిన రెండు, మూడు రోజులకే  మన దేశంలో లాక్ డౌన్ అమలులోకి రావడంతో గత మూడు నెలలుగా అక్కడ ఉండిపోయి జూన్ 17న సింగపూర్ నుంచి చెన్నై తిరిగివచ్చింది. విదేశాలనుంచి వచ్చిన వారు 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సి వస్తుందని భయపడి పోలీసుల కళ్లుగప్పి ఇంటికి వెళ్లిపోయింది.

tik tok rowdy baby

అయితే ఆమె ఉంటున్న అపార్ట్ మెంట్ వాసులు పోలీసులకు సమాచారం  ఇవ్వటంతో ఆమెను క్వారంటైన్ కు తరలించారు. క్వారంటైన్ లో ఉండేందుకు నిరాకరించి ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చిన పోలీసులతో పేచీ పెట్టుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అక్కడి ఓ ప్రవేట్ ఛానల్ టెలికాస్ట్ చేసింది. సామాన్య ప్రజలతో  క్వారంటైన్ లో తాను ఉండనని ,తనకు ప్రత్యేక వసతులు కావాలంటూ, అక్కడ ఆమె వైద్య, పోలీసు అధికారులను ముప్పతిప్పలు పెట్టింది.

tik tok rowdy baby 2

కాగా… ఓవిలేకరిని అసభ్య పదజాలంతో దూషిస్తూ ఒక  వీడియోను రిలీజ్ చేసింది. దానిపై ఆ జర్నలిస్టు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో …పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.  దీంతో ఆమె సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చుట్టుపక్కల వారు అది గమనించి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు  వైద్యులు తెలిపారు.

Read: మసాల అనుకుని చికెన్ కర్రీలో విష గుళికలు..ఇద్దరు చిన్నారులు మృతి