Tirumala : తిరుమలలో ఉగ్రవాదులు.. ఆ ఫేక్ ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే

Tirumala : ఫేక్ ఈమెయిల్ కు సంబంధించి దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు. ఫేక్ ఈ-మెయిల్ గురించి ఎవరూ భయపడాల్సిన పని లేదని, భక్తులు తిరుమల వచ్చి స్వేచ్చగా స్వామి వారిని సందర్శించుకోవచ్చని డీఐజీ అమ్మిరెడ్డి చెప్పారు.

Tirumala : తిరుమలలో ఉగ్రవాదులు.. ఆ ఫేక్ ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే

Tirumala

Tirumala : తిరుమలలో ఉగ్రవాదుల కదలికలపై ఫేక్ ఈ-మెయిల్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మరొకరి మెయిల్ ఐడీని హ్యాక్ చేసి ఈ-మెయిల్ పంపినట్లు గుర్తించారు. మధ్యప్రదేశ్ పోలీసులతో తిరుమల పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. మెయిల్ పంపిన వ్యక్తిని రెండురోజుల్లో గుర్తించగలమని అనంతపురము రేంజ్ డీఐజీ అమ్మిరెడ్డి చెప్పారు. తిరుమలలో ముమ్మరంగా తనిఖీలు జరిపామని, ఉగ్రవాదుల భయం లేదని స్పష్టం చేశారు. ఆక్టోపస్ తో పాటు అన్ని విభాగాల పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, భక్తులెవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని అమ్మిరెడ్డి చెప్పారు.

ఫేక్ ఈమెయిల్ కు సంబంధించి దర్యాఫ్తు కొనసాగుతోందన్నారు. ఫేక్ ఈ-మెయిల్ గురించి ఎవరూ భయపడాల్సిన పని లేదని, భక్తులు తిరుమల వచ్చి స్వేచ్చగా స్వామి వారిని సందర్శించుకోవచ్చని డీఐజీ అమ్మిరెడ్డి చెప్పారు.

Also Read..Terrorists In Tirumala : తిరుమలలో ఉగ్రవాదులు? క్లారిటీ ఇచ్చిన ఎస్పీ

తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నారంటూ నిన్న తిరుమల పోలీసులకు వచ్చిన ఒక మెయిల్ తీవ్ర అలజడి రేపింది. అటు పోలీస్ శాఖలో ఇటు టీటీడీలో కలకలం రేపింది. భక్తులను భయాందోళనకు గురి చేసింది. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు తిరుమలలో క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. అణువణువూ జల్లెడ పట్టారు. చివరికి తిరుమలలో ఉగ్రవాదుల కదలికలు లేవని, అది ఫేక్ మెయిల్ అని పోలీసులు తేల్చారు. దాంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

అసలేం జరిగిందంటే..
హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి కొలువుదీరిన తిరుమలలో నిన్న రాత్రి ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుమలలో ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ-మెయిల్ ద్వారా తిరుమల పోలీసులకు గుర్తుతెలియని వ్యక్తులు ఈ సమాచారం ఇచ్చారు. తిరుమల కొండపై ఉగ్రవాదులు ఉండొచ్చు, తనిఖీలు చేయండి అని అందులో ఉంది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. పోలీసులు అలర్ట్ అయ్యారు. శ్రీవారి ఆలయ పరిసరాలు, మాడవీధుల్లో టీటీడీ విజిలెన్స్, పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. సీసీ కెమెరా ఫుటేజీని కూడా పరిశీలించారు. తిరుమలలో అణువణువూ గాలించారు. చివరికి తిరుమలలో ఉగ్రవాదులు లేరని, అది ఫేక్ ఈ-మెయిల్ అని తేల్చేశారు.

Also Read..Andhra Pradesh : ఈవో అభ్యంతరకరంగా ప్రవర్తిస్తున్నారంటూ కోటప్పకొండ అర్చకుల ఆగ్రహం