Tirupati Prostitution Case : తిరుపతిలో హైటెక్ వ్యభిచారం… వాట్సప్‌లోనే అన్నీ.. బాస్‌లు మహిళలే….!

తిరుపతి శ్రీనగర్ కాలనీలో గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్యభిచారాన్ని ఇటీవల పోలీసులు చేధించారు. 5గురు యువతులను అరెస్ట్ చేసి వారిని రెస్క్యూ హోంకు తరలించారు. ఈ దందా నిర్వహిస్తున్నది ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు అని పోలీసులు తెలిపారు.

10TV Telugu News

Tirupati Prostitution Case :  నిత్యం గోవింద నామస్మరణతో మారుమ్రోగుతుండే తిరుపతి, తిరుమల క్షేత్రాలు ఆధ్యాత్మిక వాతావరణానికి పెట్టింది పేరు. నిత్యం వచ్చిపోయే వేలాది మంది యాత్రికులతో తిరుపతి నగరం సందడిగా ఉంటుంది. బస్టాండ్, రైల్వే స్టేషన్ దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిపోయే భక్తుల రాకపోకలు నేపథ్యంలో నగరం క్రమంగా అసాంఘిక కార్యకలాపాలకూ అడ్డాగా మారుతోంది. సులువుగా డబ్బు సంపాదించేందుకు తిరుపతిలో కొందరు వ్యభిచార గృహాల నిర్వహణ బాట పడుతున్నారు.

తిరుపతి శ్రీనగర్ కాలనీలో గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్యభిచారాన్ని ఇటీవల పోలీసులు చేధించారు. 5గురు యువతులను అరెస్ట్ చేసి వారిని రెస్క్యూ హోంకు తరలించారు. ఈ దందా నిర్వహిస్తున్నది ఇద్దరు మహిళలు, ఇద్దరు యువకులు అని పోలీసులు తెలిపారు. ఈ దందా నిర్వహిస్తోంది కర్ణాటక రాష్ట్రం, బళ్లారికి చెందిన స్వప్న, లక్ష్మి ప్రియగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ సాయిచరణ్, అనిరుధ్ కుమార్ అనే వారి సహయంతో విటులకు ఫోటోలు పంపి ఆకర్షిస్తున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు  చేస్తున్నారు.

తిరుపతి నగరంలోని శివారు ప్రాంతాలు ఇందుకు అడ్డాగా మారిపోయాయి. సోషల్‌ మీడియాను వాడుకుంటూ దర్జాగా హైటెక్ రీతిలో ఈ గలీజ్ దందా కొనసాగిస్తున్నారు. ఎవ్వరికీ అనుమానం రాకుండా అపార్ట్‌మెంట్లను, మారుమూల ఇళ్లనూ ఎంచుకుంటున్నారు. బెంగళూరు చెన్నై నగరాల నుంచి మహిళలు, యువతులను రప్పించి యథేచ్ఛగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌లో కొన్ని వెబ్‌సైట్‌లలో ప్రకటనలిస్తూ విటులను ఆకర్షిస్తున్నారు. తిరుపతి కాల్ గర్ల్స్ పేరిట వందలాది వెబ్‌సైట్స్‌ అందుబాటులో ఉండడం గమనార్హం. అందులో నిర్వాహకుల ఫోన్ నెంబర్లు వారి ఫోటోలు ఉంచుతున్నారు.

వాటిని చూసి ఫోన్‌ ద్వారా సంప్రదించిన వారికి మరిన్ని యువతుల ఫొటోలు, బ్యాంక్‌ ఖాతా నంబర్‌ పంపిస్తారు. డబ్బు ఖాతాలోకి రాగానే ఎంపిక చేసుకున్న లాడ్జీలకు లేదా హోటళ్లకు రమ్మని విటులకు చెబుతున్నారు. అలా కాదనుకుంటే ఆ యువతలను వారు చెప్పిన చోటికి వారి సిబ్బంది ద్వారా  పంపిస్తున్నారు. హోటల్ గదులు తీసుకున్న వారు అమ్మాయిలను కావాలని అడిగితే నిర్వాహకులతో లావాదేవీలు జరిపి నేరుగా రూమ్ కు సరఫరా చేస్తున్నారు.

సోషల్‌ మీడియా ద్వారా విటులకు వల  వేస్తున్నారు.  వ్యభిచార గృహాల నిర్వాహకులు సామాజిక మాధ్యమాలను బాగా వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా బ్రోకర్లు యువతను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపు లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో అందమైన యువతులు, మహిళల ఫొటోలను పోస్టు చేస్తున్నారు. నచ్చిన వారు సంప్రదించాలంటూ కాంటాక్ట్‌ నంబర్‌ను సైతం పెడుతున్నారు. గంటకు 5 వేల నుంచి పదివేల వరకు అలాగే యువతులను ఒక్కరోజు తీసుకువెళితే 10 వేల నుంచి 30 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

వివిధ వెబ్ సైట్ ల ద్వారా ఈ వ్యభిచార దందా తిరుపతిలో చాపకింద నీరులా సాగుతోంది. లొకాంటో, మింగిల్, ఓకే లూట్, సింపుల్ ఎస్కార్ట్స్, సొబాజో… లాంటి వెబ్ సైట్లు తిరుపతి లో అమ్మాయిలను సమకూరుస్తాము… అంటూ ప్రకటనలు ఇస్తున్నాయి. ఈ వెబ్ సైట్లు ఓపెన్ చేస్తే చాలు వందలాది మంది యువతుల ఫోటోలు దర్శనమిస్తున్నాయి. నిజానికి వీరంతా తిరుపతి వాసులేనా అన్న అనుమానం కలుగకమానదు. తెల్ల తోలు అమ్మాయిలను సైట్ లో ఉంచి మోసం చేస్తున్నట్టు తెలుస్తోంది.

బెంగళూర్, చెన్నై నుంచి అమ్మాయిలను పిలిపించి ఈ దందా కొనసాగిస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. గోదావరి జిల్లాలకు చెందిన చాలా మంది యువతులు వ్యభిచారం చేస్తూ తిరుపతి లో పట్టుబడ్డ ఘటనలూ అనేకం. ఇందులో కొందరు ఈ వ్యవహారం అన్నీ తెలిసి కొనసాగిస్తుండగా… కొందరు యువతులకు తిరుపతి లో ఉద్యోగం పేరిట ఇక్కడకు పిలిపించి వారిని ఈ నరకకూపంలోకి నెట్టుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ఇటీవలే తిరుపతిలో ఇదే తరహా ఘటన ఒకటి జరిగింది.

ఇటీవల పట్టుబడ్డ ఓ యువతి బెంగళూరుకు చెందినది కాగా, మరో యువతి గోదావరి జిల్లాకి చెందినది. ఉద్యోగం కోసం ఇక్కడకు పిలిపించి వారిచేత తప్పుడు పనులు చేయించ బోయారు.  అమ్మాయిలను ఈ రొంపిలో దించేందుకు కొత్తగా చాలా మంది బ్రోకర్లు వస్తున్నారు. పేదరికంలో ఉన్న యువతులే వీరి టార్గెట్‌. పేదరికంలో ఉన్న మహిళలు, విద్యార్థినులు, యువతులకు డబ్బు ఆశ చూపించి బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపుతున్నట్లు సమాచారం.

పక్క రాష్ట్రాల  బ్రోకర్లతో సంబంధాలు కొనసాగిస్తూ ఇక్కడి అమ్మాయిలను అక్కడికి, అక్కడి అమ్మాయిలను ఇక్కడికు తరలిస్తున్నట్టు తెలిసింది. తిరుపతి పరిసర ప్రాంతాల్లో స్టార్‌ హోటళ్లు, లాడ్జీలు, ఊరు శివార్లలో ఇళ్లు తీసుకుని విటులకు అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు.  తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలోనూ అనేక ఘటనలు చోటు చేసుకున్నాయి వ్యభిచారం కొనసాగిస్తున్న యువతులను, విటులను, బ్రోకర్లను పలు సందర్భాల్లో పోలీసులు అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో హైటెక్ వ్యభిచార దందాలు కొనసాగిస్తున్న వ్యక్తులపై పోలీసులు నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. ఆధ్యాత్మిక నగర పవిత్రత దెబ్బతినకుండా ఈ అసాంఘిక చర్యలకు పోలీసులు అడ్డుకట్ట వేయాలి.

10TV Telugu News