ప్రేమించాలని బెదిరిస్తూ, యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసిన విద్యార్ది అరెస్ట్

ప్రేమించాలని బెదిరిస్తూ, యువతి ఫోటోలు మార్ఫింగ్ చేసిన విద్యార్ది అరెస్ట్

To get close to school time sweetheart, teenager blackmails her elder sister with morphed pics : టెలివిజన్ క్రైమ్ షో చూసిన 18 ఏళ్ల బీఎస్సీ ఐటీ విద్యార్ది తన స్నేహితురాలి అక్కను ప్రేమించాలని ఫోటోలు మార్ఫింగ్ చేసి బెదిరించాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఆ యువకుడిని అరెస్ట్ చేశారు.

గుజరాత్, సూరత్ లోని సుమిత్ అఘేరా(18) అనే బీఎస్సీ ఐటీ చదువుతున్న విద్యార్ధి తన స్కూల్ మేట్ అయిన కరిష్మా వాళ్ళ అక్క కింజల్ తో పరిచయం పెంచుకోవాలనుకున్నాడు. అందుకోసం ఆమె ఫోటోలను ఇన్ స్టా గ్రాం నుంచి సేకరించాడు. వాటిని మార్ఫింగ్ చేశాడు. అప్పటికే సుమిత్ 3 నకిలీ ఇన్ స్టాగ్రాం ఎకౌంట్లు నిర్వహిస్తున్నాడు. కింజల్ తనతో చాట్ చేయాలని లేకపోతే ఆమె మార్ఫింగ్ ఫోటోలను ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేస్తానని చెప్పి బెదిరిస్తూ కరిష్మాకు ఫోటోలు పంపాడు.

ఫోటోలు చూసిన అక్కా చెల్లెళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుమిత్ ను అరెస్ట్ చేసారు. టెలివిజన్ క్రైమ్ షో చూసి స్ఫూర్తి పొంది, తాను ఇన్ స్టాగ్రాం ఎకౌంట్లు క్రియేట్ చేసి బెదిరించినట్లు పోలీసుల విచారణలో వెల్లడించాడు. అక్క చెల్లెళ్ళను బెదిరిస్తే వారిద్దరూ తనకు దగ్గరవుతారనుకున్నానని…. కింజల్ ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని కూడా పోలీసు విచారణలో వెల్లడించాడు.