Florida : జూమ్ కాల్‌లో మాట్లాడుతున్న తల్లిని షూట్ చేసిన చిన్నారి

ఒక గన్ నిండు ప్రాణాన్ని బలిగొంది. దానిని ఉపయోగిస్తే..ఏమవుతుందో తెలియని ఆ చిన్నారి..సొంత తల్లిని షూట్ చేశాడు. రక్తపు మడుగులో గిలాగిలా కొట్టుకుంటూ..ప్రాణాలు వదిలింది.

Florida : జూమ్ కాల్‌లో మాట్లాడుతున్న తల్లిని షూట్ చేసిన చిన్నారి

Gun

Toddler Fatally Shot Mom : గన్ లో ఉండే తూటాకు తెలియదు ఎవరి ప్రాణంతో తీస్తుందో. అలాగే.. గన్ కు కూడా తెలియదు ఏ కుటుంబంలో విషాదాన్ని నింపుతుందో. అన్నెం పున్నెం ఎరుగని ఓ చిన్నారికి తెలియదు తూటాలు ఉన్న గన్ తన తల్లి ప్రాణాలు తీసేస్తుందని. తనకు అమ్మను కూడా లేకుండా చేస్తుందని. తుపాకి పట్టుకోవటం ఎలాగో తెలియని ఓ రెండేళ్ల చిన్నారి తల్లినే కాల్చేసింది. తుపాకీ అంటే ఓ ఆటబొమ్మ అనుకున్న ఆ పసిబిడ్డ తల్లిని తానే పోగొట్టుకుంది. అమెరికాలో గన్ కల్చర్ ఎలా ఉందో ఈ ఘటనను బట్టి చూస్తే అర్థమౌతుంది. షూట్ చేయడంతో ఆ తల్లి రక్తపు మడుగులో గిలాగిలా కొట్టుకుంటూ..ప్రాణాలు వదిలింది. ఈ విషయం ఏమి తెలియని రెండేళ్ల చిన్నారి బిత్తరచూపులు చూస్తూ ఉంది. తీసుకొచ్చిన గన్ ను తండ్రి సురక్షిత ప్రాంతంలో పెట్టకపోయే సరికి నిండు ప్రాణం బలైంది.

Read More : Manmohan Singh : నిలకడగా మాజీ ప్రధాని ఆరోగ్యం..త్వరగా కోలకుకోవాలని మోదీ ఆకాంక్ష

షమాయా లిన్, వియాండ్రే అవరీ దంపతులు ఫ్లోరిడిలో నివాసం ఉంటున్నారు. వీరికి రెండేళ్ల కుమారుడున్నాడు. ఈమె ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నారు. కరోనా భయంతో చాలా కంపెనీలు ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్నారు. లిన్ కూడా ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు. ఆఫీసు వాళ్లతో జామ్ కాల్ లో ఏదో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో కుమారుడు వెనకకు వచ్చాడు. ఆమె తలపైకి గన్ పెట్టి కాల్చేశాడు. అక్కడికక్కడనే లిన్ కుప్పకూలిపోయింది.

Read More : Ek Shaam Charminar ke naam : చార్మినార్ వద్ద సండే – ఫండే!

జూమ్ కాల్ లో ఉన్న సహోద్యోగి ఇది చూసి షాక్ తిన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అయితే.. ఇక్కడ షమయా అడ్రస్ సహోద్యోగికి తెలియదు. తర్వాత..వియాండ్రే కు ఫోన్ చేసి సమాచారం అందించారు.
వెంటనే అక్కడకు చేరుకున్న వియాండ్రేకు కంప్యూటర్ వద్ద..రక్తపుమడుగులో షమాయా ఉండడం చూసి షాక్ తిన్నారు. ఆసుపత్రిక తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. గన్ ను నిర్లక్ష్యంగ వదిలేసి వెళ్లినందుకు అవరీని పోలీసులు అరెస్టు చేశారు.