దైవదర్శనానికి వెళ్తూ మృత్యులోకాలకు : ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. దైవదర్శనానికి వెళ్తుండగా మృత్యులోకాలకు వెళ్లారు. ఒడ్డిపల్లి సిద్దేశ్వరకొండపై ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు.

  • Published By: veegamteam ,Published On : January 1, 2020 / 02:45 PM IST
దైవదర్శనానికి వెళ్తూ మృత్యులోకాలకు : ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మృతి

చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. దైవదర్శనానికి వెళ్తుండగా మృత్యులోకాలకు వెళ్లారు. ఒడ్డిపల్లి సిద్దేశ్వరకొండపై ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు.

చిత్తూరు జిల్లాలో విషాదం నెలకొంది. దైవదర్శనానికి వెళ్తుండగా మృత్యులోకాలకు వెళ్లారు. ఒడ్డిపల్లి సిద్దేశ్వరకొండపై ట్రాక్టర్‌ బోల్తా పడి ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తవణంపల్లె మండలం మోదులపల్లి గ్రామానికి చెందిన కొంతమంది ఓం శక్తి అమ్మవారి మాల ధరించారు.

 

జనవరి 1 కావడంతో మాల ధరించిన మహిళలు, అలాగే చిన్నారులు మొత్తం కలిపి 33 మందికి పైగా ట్రాక్టర్ లో ఒట్టిపల్లి దగ్గర ఉన్న సిద్దేశ్వరకొండపైనున్న సిద్ధేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. కొండపైకి వెళ్తున్నక్రమంలో చాలా ఇరుకైన ఘాట్‌రోడ్డుపై ఒక్కసారిగా ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో బోల్తా పడింది.

 

ఇంజన్, క్యారియర్ విడిపోయాయి. క్యారియర్ లో ఉన్న వారంతా కుప్పకూలిపోయారు. వారిపై క్యారియర్ పడి పోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. బుజ్జమ్మ, లోకమ్మతోపాటు 7 ఏళ్ల గౌతమ్ అనే బాలుడు కూడా చనిపోయాడు. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

 

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వారికి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అవగాహన లేకుండా ట్రాక్టర్ పై ఎక్కువ మంది తీసుకెళ్తున్న డ్రైవర్ తప్పిదం కారణంగానే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.