Chittoor : తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో కొడుకు దుర్మరణం, తట్టుకోలేక తల్లి కూడా..

Chittoor : పవన్ కు తొలుత వేలూరు సీఎంసీలో చికిత్స అందించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పవన్ మృతి చెందాడు.

Chittoor : తీవ్ర విషాదం.. విద్యుత్ షాక్‌తో కొడుకు దుర్మరణం, తట్టుకోలేక తల్లి కూడా..

Chittoor (Photo : Google)

Chittoor Tragedy : చిత్తూరు జిల్లా యాదమరిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అధికారుల నిర్లక్ష్యానికి రెండు ప్రాణాలు బలయ్యాయి. కొడుకు చావు వార్తను తట్టుకోలేకపోయిన తల్లి కూడా మృతి చెందింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో లైన్ మెన్ పవన్ మరణించాడు. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి తల్లిడిల్లిపోయిది. కాసేపటికే పవన్ తల్లి సైతం మృతి చెందింది.

పవన్.. యాదమరి సచివాలయంలో లైన్ మెన్ గా పనిచేస్తున్నాడు. మరమ్మత్తులు నిమిత్తం అనుమతులు తీసుకొని విద్యుత్ స్తంభం ఎక్కాడు. అయితే, అదే సమయంలో కరెంట్ ఆన్ చేయడంతో పవన్ విద్యుత్ షాక్ కు గురయ్యాడు. అంతే, తీవ్రంగా గాయపడ్డాడు. పవన్ కు తొలుత వేలూరు సీఎంసీలో చికిత్స అందించారు. తర్వాత మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పవన్ మృతి చెందాడు.

Also Read..Karnataka : OMG.. పెట్రోల్ బంకులో ఫోన్ వాడుతున్నారా? ఎంత ప్రమాదమో చూడండి.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

ఈ విషయం అతడి తల్లికి తెలిసి షాక్ కి గురైంది. కొడుకు ఇక లేడు అనే వార్తను ఆమె జీర్ణించుకోలేకపోయింది. కుమారుడి మరణాన్ని తట్టుకోలేక తల్లి సైతం మృతి చెందింది. గంటల వ్యవధిలోనే అటు కొడుకు ఇటు తల్లి మరణించడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబసభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతం అయ్యారు.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. అయ్యో పాపం.. అంటూ స్థానికులు సైతం విలపించారు. కాగా, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే పవన్ చనిపోయాడని బంధువులు ఆరోపించారు. అధికారుల తీరుకి నిరసనగా పవన్ మృతదేహంతో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. దాంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి పంపేశారు.

Also Read..Nara Lokesh : అప్పుడు బాబాయ్‌కి గుండెపోటు అన్నారు, ఇప్పుడు తల్లికి గుండెపోటు అంటున్నారు- చాలా భయంగా ఉందన్న లోకేశ్