Sons Betting Kills Father : తీవ్ర విషాదం.. తండ్రి ప్రాణం తీసిన కొడుకుల బెట్టింగ్, మద్యం మత్తులో ఈదలేక తండ్రి మృతి

మద్యం మత్తులో తండ్రీ కొడుకుల మధ్య బెట్టింగ్ వారి కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. మద్యం మత్తులో ఉండటంతో ఈదలేకపోయిన తండ్రి.. చెరువు నీటిలో మునిగి చనిపోయాడు.

Sons Betting Kills Father : తీవ్ర విషాదం.. తండ్రి ప్రాణం తీసిన కొడుకుల బెట్టింగ్, మద్యం మత్తులో ఈదలేక తండ్రి మృతి

Sons Betting Kills Father : నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో తండ్రీ కొడుకుల మధ్య బెట్టింగ్ వారి కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. చెరువు నీటిలో ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు ఈదాలని తండ్రీ కొడుకులు పందెం కాశారు.

కానీ, మద్యం మత్తులో ఉండటం, చెరువు పెద్దదిగా ఉండటంతో మధ్యలోనే నీటిలో మునిగి చనిపోయాడు తండ్రి కృష్ణయ్య. ఆయన నీటిలో మునిగిపోతున్న సమయంలో కొడుకులు వీడియోలు తీశారు.

గ్రామంలో పండుగ ఉండటంతో తండ్రీ కొడుకులు మద్యం సేవించారు. ఆ తర్వాత సరదాగా ఈత కోసం చెరువు దగ్గరికి వెళ్లారు. మద్యం మత్తులో బెట్టింగ్ కాసి తండ్రి ప్రాణాలు పోయేందుకు కారణమయ్యారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. బుద్ధి లేని పని చేశారంటూ తండ్రి చావుకి కారణమైన కొడుకులపై స్థానికులు మండిపడుతున్నారు. తండ్రి నీటిలో మునిగిపోతుంటే.. కాపాడాల్సింది పోయి వీడియోలు తీయడం దుర్మార్గం అన్నారు.

Also Read : Man Kill Daughter : తిండి పెట్టేందుకు డబ్బు లేదని రెండేళ్ల కూతురిని చంపిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అరెస్ట్

కొడుకులతో బెట్టింగ్ కాసిన తండ్రి.. చెరువులోకి దిగాడు. ఇవతలి ఒడ్డు నుంచి అవతలి ఒడ్డుకు ఈదడం ప్రారంభించాడు. అయితే, కొంత దూరం వెళ్లాక.. తండ్రి కృష్ణయ్య ఈదలేకపోయాడు. అసలే మద్యం మత్తులో ఉన్నాడు, పైగా లోతైన ప్రాంతం. దీంతో ఈదలేక పోయిన కృష్ణయ్య.. నీటిలో మునిగి చనిపోయాడు.

అతడి కొడుకులు రవితేజ, ఉదయ్ కుమార్.. తండ్రి నీటిలో మునిగిపోతుంటే.. కాపాడాల్సింది పోయి.. వీడియోలు తీస్తూ ఉండిపోయారు. బెట్టింగ్ కాయడం నేరడం కావడంతో.. పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. బెట్టింగ్ కాసి తండ్రి ప్రాణం పోవడానికి కారణమైన ఇద్దరు కొడుకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read : Delhi : లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తి కళ్లల్లో కారం కొట్టి కారు ఎత్తుకుపోయిన దొంగలు

మద్యం సేవించిన వ్యక్తితో బెట్టింగ్ కాయడం ఒక తప్పిదం అయితే, తండ్రి నీటిలో మునిగిపోతున్నా కాపాడేందుకు ఎలాంటి సాయం చేయకపోగా… కేరింతలు కొడుతూ వీడియోలు తీయడం మరో దారుణమైన తప్పిదం అంటున్నారు పోలీసులు. కళ్ల ముందే తండ్రి నీటిలో మునిగిపోతున్నా.. ఆ కొడుకులు ఒడ్డునే ఉండి వీడియోలు తీస్తూ ముచ్చట్లు ఆడారు.

 

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.