Tragedy : సనత్‌నగర్‌లో దారుణం.. ఇంటి మందున్న చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు

Tragedy : సనత్‌నగర్‌లో దారుణం.. ఇంటి మందున్న చిన్నారిపై కారు ఎక్కించిన యువకులు

Tragedy

Tragedy : హైదరాబాద్ సనత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. జింకలవాడ బస్తీలో రెండేళ్ల చిన్నారిపై కారు ఎక్కించారు కొంతమంది యువకులు. ఓవర్ స్పీడ్ తో కారు నడిపిన నిందితులు.. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపైకి దూసుకెళ్లారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

తీవ్రంగా గాయపడిన చిన్నారి స్పాట్ లోనే చనిపోయింది. ఆ తర్వాత నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా కారుని గుర్తించిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.