Train Collided Bus : నైజీరియాలో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొన్న రైలు, ఆరుగురు మృతి

నైజీరియాలోని లాగోస్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. ప్రభుత్వ ఉద్యోగులతో వెళ్తోన్న బస్సును ఇంటర్ సిటీ రైలు ఢీకొట్టింది.

Train Collided Bus : నైజీరియాలో ఘోర ప్రమాదం.. బస్సును ఢీకొన్న రైలు, ఆరుగురు మృతి

ACCIDENT

Train Collided Bus : నైజీరియాలోని లాగోస్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. నేషనల్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఏజెన్సీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగులతో వెళ్తోన్న బస్సును ఇంటర్ సిటీ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు నైజీరియా నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ అధిపతి ఇబ్రహీం ఫారిన్ లోయ్ వెల్లడించారు.

ఇప్పటివరకు 84 మందిని రక్షించి ఆస్పత్రికి తరలించామని తెలిపారు. క్షతగాత్రులకు ఆస్పత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. ఫారిన్ లాయ్ కు చెందిన బస్సు ప్రభుత్వ ఉద్యోగులను కార్యాలయానికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు.

థాయిలాండ్‌ లో బస్సును ఢీకొట్టిన రైలు.. 20 మంది మృతి

బస్సు డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని లాగోస్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్ మెంట్ ఏజెన్సీ కార్యదర్శి ఒలుఫైమి ఒకే ఒసానింటోలు చెప్పారు. డ్రైవర్ బస్సును నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొన్నారు. బస్సు డ్రైవర్ ట్రాఫిక్ సిగ్నల్ ను పట్టించుకోకుండా నడిపారని వెల్లడించారు.