No Ambulance: అంబులెన్స్ కోసం అర్ధరాత్రి బిడ్డ మృతదేహంతో బాలింత నిరీక్షణ

గర్భంతో ఉన్న గంగి అనే గిరిజన మహిళను ఆమె భర్త కంకేర్‌లంక హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ గంగి ఒక బాబుకు జన్మనిచ్చింది. అయితే, బాబులో హృదయ స్పందన లేకపోవడంతో 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న దోర్నపల్ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లమని సూచించారు.

No Ambulance: అంబులెన్స్ కోసం అర్ధరాత్రి బిడ్డ మృతదేహంతో బాలింత నిరీక్షణ

No Ambulance

No Ambulance: ప్రభుత్వాసుపత్రుల్లో అంబులెన్స్‌ల కోసం పేద రోగులు ఎదురు చూడాల్సిన పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంబులెన్స్‌లు లేకపోవడం, ఒకవేళ అందుబాటులో ఉన్నా వాటికి డబ్బులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో కుటుంబ సభ్యులను భుజాలపై, బైకులపై తీసుకెళ్తున్న ఘటనలు జరుగుతున్నాయి. ఇలాంటివి ఎన్ని జరిగినా అధికార యంత్రాంగంలో మార్పు రావడం లేదు. తాజాగా చత్తీస్‌ఘడ్‌లో జరిగిన సంఘటనే దీనికి నిదర్శనం.

Ruchira Kamboj: ఐరాసలో భారత ప్రతినిధిగా రుచిరా కాంబోజ్

గర్భంతో ఉన్న గంగి అనే గిరిజన మహిళను ఆమె భర్త కంకేర్‌లంక హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ గంగి ఒక బాబుకు జన్మనిచ్చింది. అయితే, బాబులో హృదయ స్పందన లేకపోవడంతో 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న దోర్నపల్ హెల్త్ సెంటర్‌కు తీసుకెళ్లమని సూచించారు. అక్కడ్నుంచి అంబులెన్స్‌లో దోర్నపల్ వెళ్లారు. అక్కడ బాబును పరీక్షించిన వైద్య సిబ్బంది, 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న సుక్మా హాస్పిటల్ తీసుకెళ్లమని సూచించారు. అయితే, అంబులెన్స్‌లో సుక్మా వెళ్తుండగా మార్గమధ్యలోనే చిన్నారి చనిపోయాడు. దీంతో వెనుదిరిగి, తిరిగి దోర్నపల్ చేరుకున్నారు. సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో అంబులెన్స్‌లో దోర్నపల్ చేరుకున్నారు. అక్కడ అంబులెన్స్‌ వాళ్లను దించేసి వెళ్లిపోయింది. అక్కడ్నుంచి మరో అంబులెన్స్‌లో సొంతూరికి చేరుకోవాలనుకున్నారు. అయితే, ఆసుపత్రి అధికారులు చెప్పినట్లుగా అంబులెన్స్‌ రాలేదు. అర్ధరాత్రి దాటినా అంబులెన్స్‌ రాలేదు. బిడ్డ మృతదేహంతో బాలింత అయిన గంగి దంపతులు రాత్రిపూట అలా అంబులెన్స్‌ కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. వీళ్ల పరిస్థితిని గమనించిన ఒక జర్నలిస్టు.. సమస్యను ఉన్నతాధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాడు.

RJD MLA: బిహార్ ఎమ్మెల్యేకు పదేళ్ల జైలు శిక్ష

వెంటనే స్పందించిన కలెక్టర్, అంబులెన్స్‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చాడు. అయినా అంబులెన్స్‌ రాలేదు. అంబులెన్స్‌ కోసం చాలా సేపు ఎదురు చూశారు. అర్ధరాత్రి దాటిన తర్వాత చివరకు జర్నలిస్టే తన సొంత వాహనంలో వాళ్లను ఊళ్లో దిగబెట్టి వచ్చాడు. ఈ ఘటనపై కలెక్టర్‌తోపాటు దోర్నపల్ ఆసుపత్రి అధికారులు స్పందించారు. అంబులెన్స్‌లు ఉన్నప్పటికీ డ్రైవర్లే అందుబాటులో లేరని, అందువల్లే వాళ్లకు సాయం చేయలేకపోయామని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. మరోవైపు తాను చెప్పిన అంబులెన్స్‌ వచ్చే లోపు వాళ్లు వెళ్లిపోయారని కలెక్టర్ అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతానని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ చెప్పారు.