Tammineni Krishnaiah Murder Case : టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యపై అనేక అనుమానాలు..ఓ పార్టీకి చెందిన ఇద్దరి నేతల కీలక పాత్ర?

ఖమ్మం టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణయ్య హత్యలో ఓ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు కీలక పాత్ర పోషించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారికి సహకరించిన మరో ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tammineni Krishnaiah Murder Case : టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యపై అనేక అనుమానాలు..ఓ పార్టీకి చెందిన ఇద్దరి నేతల కీలక పాత్ర?

Tammineni Krishnaiah Murder Case : ఖమ్మం టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణయ్య హత్యలో ఓ పార్టీకి చెందిన ఇద్దరు నేతలు కీలక పాత్ర పోషించినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారికి సహకరించిన మరో ఐదుగురిని కూడా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.

శుక్రవారం సాయంత్రం వరకు నిందితుల అరెస్ట్ చూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మర్డర్ కు స్కెచ్ వేసిన ఇద్దరు ప్రధాన నిందితులు పరారీలో ఉండగా వారి కోసం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మూడు స్పెషల్ టీమ్ లు గాలిస్తున్నాయి. తెలంగాణలో సంచనలంగా మారిన తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఏ1 తమ్మినేని కోటేశ్వరరావు, ఏ3 జక్కంపూడి కృష్ణ మినహా మిగిలిన వారు పోలీసులకు చిక్కారు. తమ్మినేని కోటేశ్వరరావు, జక్కంపూడి కృష్ణ పరారీలో ఉన్నారు. నిందితుల స్టేట్ మెంట్ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తు జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలు సేకరించారు పోలీసులు. గంజి స్వామి, నూకల లింగయ్య, శ్రీను, నాగేశ్వరరావు, నాగయ్యను పోలీసులు విచారిస్తున్నారు. స్వాతంత్ర్యం దినోత్సవం రోజున తమ్మినేని కృష్ణయ్యను ప్రత్యర్థులు అత్యంత కిరాతకంగా హతమార్చారు.

గతంలో తమ్మినేని కృష్ణయ్య మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఏడాది క్రితం తమ్మినేని కృష్ణయ్య ఓ కార్యక్రమంలో పాల్గొనగా ప్రత్యర్థులతో ఘర్షణ జరిగింది. ఇందులో ప్రత్యర్థులు చంపుతామని కృష్ణయ్యను బెదిరించారు. అయితే తాను చావుకి భయపడను అని, ప్రజల కోసం చావడానికైనా సిద్ధమే అంటూ తమ్మినేని కృష్ణయ్య అన్నారు. తనను ఎప్పుడు ఎవరైనా చంపొచ్చని అప్పుడు ఆయన చెప్పారు. తాను చావుకి భయపడే పిరికి వాడిని కాదన్నారు. దీంతో కృష్ణయ్య మర్డర్ పక్కా రాజకీయ కోణంలోనే జరిగినట్లు అనుమానాలు బలపడుతున్నాయి.