Minor Couple Murder : మైనర్ ప్రేమజంటను హత్యచేసిన కసాయి తండ్రి

తన కూతుర్ని ప్రేమించాడని కూతుర్ని, ఆమె ప్రియుడ్ని ఓ కసాయి తండ్రి హత్య చేసిన అమానుష ఘటన కాన్పూర్ లో చోటు చేసుకుంది.

Minor Couple Murder : మైనర్ ప్రేమజంటను హత్యచేసిన కసాయి తండ్రి

Minor Couple Murder

Minor Couple Murder : తన కూతుర్ని ప్రేమించాడని కూతుర్ని, ఆమె ప్రియుడ్ని ఓ కసాయి తండ్రి హత్య చేసిన అమానుష ఘటన కాన్పూర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో మైనర్ ప్రేమికులిద్దరూ దారుణ హత్యకు గురయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా ఘటంపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన టీనేజ్ యువతి(16) అదే గ్రామానికి చెందిన తన కంటే చిన్నవాడైన టీనేజ్(15) యువకుడ్ని ప్రేమించింది.

యువతి తండ్రి ట్రక్ డ్రైవర్ గా పని చేస్తుంటాడు. కొన్నాళ్లకు ఈవిషయం యువతి తండ్రికి తెలిసింది. అతను ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇచ్చి తన కూతురుతో ప్రేమ వ్యవహారం మానుకోమని యువకుడికి చెప్పాడు. ఇలా ఉండగా మే15 శనివారం నాడు డ్రైవర్ కుటుంబం కుమార్తెను ఇంట్లో వదిలి, పక్క ఊరిలో ఉన్న బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లారు.

ఇంట్లో ఎవరూ లేకపోవటంతో టీనేజ్ యువతి తన యువప్రేమికుడ్ని ఇంటికి పిలిపించుకుంది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లి లోపల గడియపెట్టుకున్నారు. ఈవిషయాన్ని గమనించిన యువతి బంధువు బయట నుంచి గడియపెట్టి యువతి తండ్రికి సమాచారం ఇచ్చాడు. ఆఘమేఘాల మీద యువతి తండ్రి పక్క ఊరునుంచి ఇంటికి వచ్చి లోపలకువెళ్ళాడు. తన కుమార్తెను, ఆమెతో ఉన్న ప్రియుడ్ని ఇద్దరినీ గొడ్డలితో దారుణంగా నరికి హత్య చేశాడు.

ఆదివారం నాడు తన కుమారుడు ఇంటికి రాకపోయే సరికి యువకుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈలోపు యువతి బంధువు ఒకరు తప్పిపోయిన యువకుడి ఆచూకి తండ్రికి చెప్పాడు.

యువతి ఇంటివద్దకు వచ్చిన మైనర్ యువకుడి తండ్రికి అక్కడ రక్తపు మడుగులో పడివున్న కొడుకు, యువతి కనిపించారు.వెంటనే ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నిందితుడైన ట్రక్ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. హత్యకు ఉపయోగించిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.