ప్రాణం తీసిన టీవీ సీరియల్ : సూసైడ్ సీన్ ఇమిటేట్ చేస్తూ బాలిక మృతి 

సాధారణంగా చిన్నారులపై టీవీలు, సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టీవీల్లో వచ్చే ప్రతి ప్రొగ్రామ్ ను ఫాలో అవుతుంటారు. కొన్నిసార్లు టీవీలో సీరియల్ సీన్లను చూసి అనుసరిస్తుంటారు.

10TV Telugu News

సాధారణంగా చిన్నారులపై టీవీలు, సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టీవీల్లో వచ్చే ప్రతి ప్రొగ్రామ్ ను ఫాలో అవుతుంటారు. కొన్నిసార్లు టీవీలో సీరియల్ సీన్లను చూసి అనుసరిస్తుంటారు.

సాధారణంగా చిన్నారులపై టీవీలు, సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. టీవీల్లో వచ్చే ప్రతి ప్రొగ్రామ్ ను ఫాలో అవుతుంటారు. కొన్నిసార్లు టీవీలో సీరియల్ సీన్లను చూసి అనుసరిస్తుంటారు. బెంగళూరుకు చెందిన 11ఏళ్ల బాలిక కూడా ఇలానే టీవీ చూస్తూ సూసైడ్ సీన్ ను ఇమిటేట్ చేసింది. ప్రమాదవశాత్తూ మెడకు ఉరి బిగిసి బాలిక ప్రాణాలు విడిచింది.

ఈ ఘటన ఆదివారం (మే 5, 2019) రాత్రి చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. మల్లసంద్రా ప్రాంతానికి చెందిన 11ఏళ్ల బాలిక ఓ ప్రైవేట్ స్కూల్లో 5వ తరగతి చదువుతోంది. స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత టీవీ ఆన్ చేసింది. అందులో ఏదో సీన్ వస్తుంటే చూస్తుండి పోయింది. అదో సూసైడ్ సీన్.. బాలిక ఆ సీన్ చూసి అలానే తాను కూడా చేసేందుకు ప్రయత్నించింది.

ఈ క్రమంలో ఇంట్లో తన గదిలో స్టూల్ పై నిలబడి గోడకు కొట్టిన హ్యాంగర్ కు తాడుతో మెడకు ఉరి వేసుకుంది.  అనుకోకుండా కాలు జారడంతో బాలిక మెడకు ఉరి బిగిసి ఊపిరి ఆడక మృతిచెందింది. ఈ సమయంలో బాలిక తల్లిదండ్రులు ఇంటి బయట ఉన్నారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చేసరికి  బాలిక వేలాడుతూ కనిపించింది.

కంగారుపడిన తల్లిదండ్రులు బాలికను సమీప ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చిన్నారి మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. బెంగళూరు పోలీసులు యాక్సిడెంటల్ డెత్ కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 2018 ఏడాదిలో కోల్ కతాలో కూడా ఏడేళ్ల బాలిక ఇలానే టీవీలో వచ్చిన సూసైడ్ సీన్ చూస్తూ అనుసరించి ప్రాణాలు కోల్పోయింది.