TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసు.. అధికారిణి శంకర్ లక్ష్మీ విచారణలో కీలక విషయాలు

టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ట్విస్టు వెలుగు చూసింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకర్ లక్ష్మీ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. శంకర్ లక్మీతోపాటు మరో మహిళను సిట్ అధికారులు విచారించారు.

TSPSC Paper Leak  : టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ట్విస్టు వెలుగు చూసింది. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకర్ లక్ష్మీ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. శంకర్ లక్మీతోపాటు మరో మహిళను సిట్ అధికారులు విచారించారు. శంకర్ లక్ష్మీ డైరీలోని పాస్ వర్డ్ చోరీపై ప్రశ్నించారు. అయితే తన డైరీలో ఎక్కడా పాస్ వర్డ్ రాయలేదని శంకర్ లక్ష్మీ తెలిపారు. డైరీలోని పాస్ వర్డ్ చోరీ చేశామని నిందితులు విచారణలో చెప్పడంతో సిట్(SIT)అధికారులు శంకర్ లక్ష్మీని ప్రశ్నించారు. సుమారు రెండు గంటలకు పైగా శంకర్ లక్ష్మీని విచారించారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో విచారణ కొనసాగుతోంది. పేపర్ లీకేజీ నిందితులు రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్ పై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. వనపర్తి జిల్లా గోపాల్ పేట్ మండలం బుద్ధారం బాలికల గురుకుల పాఠశాలలో హిందీ టీచర్ గా రేణుక పనిచేస్తున్నారు. ఎస్సీ గురుకుల సొసైటీ సెక్రెటరీ రోనాల్డ్ రోస్ కి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ నివేదిక పంపారు. దీని ఆధారంగా రేణుకని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే, రేణుక భర్త డాక్యా నాయక్ ను విధుల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ కు సిట్ నోటీసులు

వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ఎంపీడీవో ఆఫీస్ లో ఉపాధి హామీలో టెక్నికల్ అసిస్టెంట్ గా డాక్యా నాయక్ పని చేస్తున్నారు. పేపర్ లీకేజీ నేపథ్యంలో ఇప్పటికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. పలువురు రాజకీయ నాయకులు పలు ఆరోపణలు చేయడంతో ఆధారాల కోసం వారికి కూడా నోటీసులు జారీ అయ్యాయి.

ట్రెండింగ్ వార్తలు