TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బండి సంజయ్ కు సిట్ నోటీసులు

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని నోటీసులు పంపారు.

TSPSC paper leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీపై చేసిన ఆరోపణలపై ఆధారాలు ఇవ్వాలని నోటీసులు పంపారు. మార్చి24న తమ ముందు హాజరై ఆధారాలు సమర్పించాలని సిట్ అధికారులు ఆదేశించారు. బండి సంజయ్ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు ఆయన లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు.

ఇప్పటికే రాజకీయ నేతలకు సిట్ నోటీసులు పంపడంపై బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ నోటీసుల జారీ పేరుతో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. కుట్రకు కారకులైన వారిని వదిలేసి ప్రతిపక్షాలకు నోటీసులు ఇవ్వడం సిగ్గు చేటన్నారు. సిట్ నోటీసులు, విచారణకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

TSPSC Paper Leak : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో కీలక అంశాలు

సిట్ కేసీఆర్ జేబు సంస్థ అని ఆరోపించారు. ఆధారాలిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వాస్తవాలు బయటికి వస్తాయన్న భయంతోనే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించేందుకు సీఎం కేసీఆర్ భయపడుతున్నారని పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమైతే తమ వద్ద ఉన్న ఆధారాలు సమర్పించేందుకు సిద్ధమని చెప్పారు.

టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారిణి శంకర్ లక్ష్మీ విచారణలో కీలక విషయాలు బయటపడ్డాయి. శంకర్ లక్మీతోపాటు మరో మహిళను సిట్ అధికారులు విచారించారు. శంకర్ లక్ష్మీ డైరీలోని పాస్ వర్డ్ చోరీపై ప్రశ్నించారు.

SIT Notice : టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ పై ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డికి సిట్ నోటీసులు

అయితే తన డైరీలో ఎక్కడా పాస్ వర్డ్ రాయలేదని శంకర్ లక్ష్మీ తెలిపారు. డైరీలోని పాస్ వర్డ్ చోరీ చేశామని నిందితులు విచారణలో చెప్పడంతో సిట్(SIT)అధికారులు శంకర్ లక్ష్మీని ప్రశ్నించారు. సుమారు రెండు గంటలకు పైగా శంకర్ లక్ష్మీని విచారించారు. పేపర్ లీకేజీ నిందితులు రేణుక, ఆమె భర్త డాక్యా నాయక్ పై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.

ట్రెండింగ్ వార్తలు