Tiruamala Seva Tickets : శ్రీవారి సేవా టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న వారిపై కేసు

తిరుమల శ్రీవారిఆలయంలో 300రూపాయల దర్శనం టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ముఠాపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు.

Tiruamala Seva Tickets : శ్రీవారి సేవా టికెట్లు బ్లాక్‌లో విక్రయిస్తున్న వారిపై కేసు

Tirumala Sri Vari Temple

Tiruamala Seva Tickets : తిరుమల శ్రీవారిఆలయంలో 300  రూపాయల దర్శనం టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్న ముఠాపై తిరుపతి పోలీసులు కేసు నమోదు చేశారు.  చెన్నైకి చెందిన రేవతి పద్మావతి ట్రావెల్స్ అనే సంస్ధ టీటీడీ వెబ్ సైట్ లో విడుదల చేసిన టికెట్లను భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు టీటీడీ విజిలెన్స్ విభాగం గుర్తించింది. ఈమేరకు టీటీడీ అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో పోలీసులు చెన్నైకి చెందిన రేవతి పద్మావతి ట్రావెల్స్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లను వచ్చే నెల కోటాను…. ప్రతి నెల 20వ తేదీన టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తోంది. కొంతమంది దళారులు, ట్రావెల్స్ సంస్థలు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని టీటీడీకి ఫిర్యాదు చేశారు.

భక్తులు ఫిర్యాదు మేరకు చెన్నైకి చెందిన రేవతి ట్రావెల్స్ సంస్థ పై టీడీడీ విజిలెన్స్ అధికారుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. భక్తులు www tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో తమ ఆధార్ కార్డ్ నంబర్, చిరునామాతో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం టీటీడీ కల్పించిందని.. భక్తులు దళారులను ఆశ్రయించి నష్ట పోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేసింది.