ట్యూషన్‌ కోసం ఇంటికొచ్చిన మైనర్‌ బాలికపై అత్యాచారం

ట్యూషన్‌ కోసం ఇంటికి వచ్చిన మైనర్‌ బాలికపై సదరు ట్యూటర్‌ అత్యాచారం చేశాడు. ఈ ఘటన ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసింది. 

  • Published By: veegamteam ,Published On : March 6, 2020 / 03:02 PM IST
ట్యూషన్‌ కోసం ఇంటికొచ్చిన మైనర్‌ బాలికపై అత్యాచారం

ట్యూషన్‌ కోసం ఇంటికి వచ్చిన మైనర్‌ బాలికపై సదరు ట్యూటర్‌ అత్యాచారం చేశాడు. ఈ ఘటన ముజఫర్‌నగర్‌లో వెలుగుచూసింది. 

మహిళలు, బాలికలపై లైంగిక దాడుల నిరోధానికి నిర్భయ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధుల అఘాయిత్యాలకు బ్రేక్ పడటం లేదు. దేశంలో అనునిత్యం ఏదో ఒక మూలన అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ట్యూషన్‌ కోసం ఇంటికి వచ్చిన మైనర్‌ బాలికపై సదరు ట్యూటర్‌ అత్యాచారం చేశాడు. ఈ ఘటన ముజఫర్‌నగర్‌లో చోటు చేసుకుంది. 

ట్యూటర్‌ భార్య ద్వారా ఈ విషయం తెలియడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణంలోని సివిల్‌లైన్స్‌ ప్రాంతంలో నిందితుడిని అరెస్ట్‌ చేశారు. కాగా ట్యూషన్‌ పేరిట ఆమెను ప్రేమలోకి దింపిన నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని భార్య వెల్లడించారు. 

మరో మహిళతోనూ అతడికి సంబంధం ఉందని, ఆమెతో ఓ బిడ్డకు జన్మనిచ్చాడని ఆయన భార్య తెలిపింది. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.