TV Actress : టీవీ నటిని నగ్నంగా వీడియోలు తీసి బెదిరిస్తున్న ప్రియుడు

టీవీ సీరియల్స్ లోనటించే నటితో సహాజీవనం చేస్తున్న వ్యక్తి ఆమెను నగ్నంగా వీడియో తీసిబ్లాక్ మెయిల్ చేయటం మొదలెట్టాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

TV Actress : టీవీ నటిని నగ్నంగా వీడియోలు తీసి బెదిరిస్తున్న ప్రియుడు

Tv Actress

TV Actress filed a complaint against boyfriend :  టీవీ సీరియల్స్ లోనటించే నటితో సహాజీవనం చేస్తున్న వ్యక్తి ఆమెను నగ్నంగా వీడియో తీసిబ్లాక్ మెయిల్ చేయటం మొదలెట్టాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది.

తమిళనాడు,మనాలి సమీపంలోని చిన్న సేక్కాడు ప్రాంతానికి చెందిన జెన్నిఫర్(24) అనే మహిళ ఐదేళ్లుగా టీవీ సీరియల్స్ లో నటిస్తోంది. ఆమె చెన్నై ఎమ్జీఆర్ నగర్ కు చెందిన శరవణన్ అనే వ్యక్తిని 2019 ఆగస్ట్ 25న పెళ్లి చేసుకుంది. అయితే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు రావటంతో వాళ్లిద్దరూ విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో దావా వేశారు. కోర్టులో కేసు నడుస్తోంది.

ఇటీవల ఆమె టీవీ సీరియల్స్ కు సహయ దర్శకుడిగా పనిచేస్తున్న నవీన్ కుమార్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తున్నట్లు తెలిపింది. కరోనా లాక్ డౌన్ సమయంలో నవీన్ కుమార్ కు అవకాశాలు లేకపోవటంతో నిరుద్యోగిగా మారాడు. జెన్నీఫర్ ఉన్న అవకాశాలతో నటిగా కొనసాగుతోంది.

అవకాశాలు లేని నవీన్ కుమార్ ఆమెను డబ్బులు డిమాండ్ చేయసాగాడు.  ఒకరోజు షూటింగ్ నుంచి ఇంటికి తీసుకు వెళుతుండగా ఆమెను కారులో నగ్నంగా వీడియో తీశాడు. ఈవిషయాన్ని ఆమె నవీన్ తల్లి దృష్టికి తీసుకువెళ్లగా.. ఆమె తన కొడుకు చెప్పినట్లు నడుచుకోమని బెదిరించింది.

నగ్న వీడియో అడ్డం పెట్టుకుని తనను బ్లాక్ మెయిల్ చేస్తున్న నవీన్ కుమార్ పై జెన్నీఫర్ మనాలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నవీన్ కుమార్ తీసిన వీడియో తనకు ఇప్పించాలని…. తనపై దౌర్జన్యాలకు పాల్పడిన నవీన్ కుమార్ అతని తల్లిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో  పేర్కోన్నారు.