అక్కన్నపేట కాల్పుల వ్యవహారం : ఏకే-47, కార్బన్ రైఫిల్ పోలీసులవేనని అనుమానాలు

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట కాల్పుల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అక్కన్నపేట కేసులో స్వాధీనం చేసుకున్న ఏకే-47, కార్బన్ రైఫిల్ పోలీసులవేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • Published By: veegamteam ,Published On : February 9, 2020 / 09:12 AM IST
అక్కన్నపేట కాల్పుల వ్యవహారం : ఏకే-47, కార్బన్ రైఫిల్ పోలీసులవేనని అనుమానాలు

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట కాల్పుల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అక్కన్నపేట కేసులో స్వాధీనం చేసుకున్న ఏకే-47, కార్బన్ రైఫిల్ పోలీసులవేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సిద్ధిపేట జిల్లా అక్కన్నపేట కాల్పుల వ్యవహారం మలుపులు తిరుగుతోంది. అక్కన్నపేట కేసులో స్వాధీనం చేసుకున్న ఏకే-47, కార్బన్ రైఫిల్ పోలీసులవేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయుధాలు మిస్సింగ్‌ విషయంలో తనను కావాలనే ఉన్నతాధికారులు ఇరికించారంటూ రిటైర్డ్ సీఐ భూమయ్య ఆరోపిస్తున్నారు. 
2016లో హుస్నాబాద్ పీఎస్‌లో మిస్సైన ఏకే 47, కార్బన్ రైఫిల్.. సదానందం దగ్గర లభ్యమైన వెపన్స్ అవేనని అనుమానిస్తున్నారు. హుస్నాబాద్ పీఎస్‌లో 2 గన్స్‌తోపాటు 32 బుల్లెట్స్‌ మిస్‌ అయ్యాయి. గతంలో వెపన్స్ మిస్‌ అవడంలో తన పాత్రేమీలేదని రిటైర్ట్ సీఐ భూమయ్య అంటున్నారు. కొందరు అధికారులు కావాలనే తనను ఇరికించారని చెబుతున్నారు. 

అక్కన్న పేటలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. శుక్రవారం (ఫిబ్రవరి7, 2020)న గంగరాజు అనే వ్యక్తిపై సందానందం అనే వ్యక్తి ఏకే 47తో కాల్పులు జరిపాడు. హఠాత్తుగా తుపాకీతో గంగరాజు జరిపిన కాల్పుల నుంచి సందానం తృటిలో తప్పించుకున్నాడు. దీంతో తుపాకీ పట్టుకుని గంగరాజు పరారయ్యాడు. కాల్పుల సౌండ్ వినిపించేసరికి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలీక అల్లాడిపోయారు.
కాగా గంగరాజుకు..సదానందానికి ఇటీవల సరిహద్దు ప్రహరీగోడ విషయంలో వివాదం జరిగింది. అదికాస్తా ఇరుకుటుంబాల మధ్యా ఘర్షణలకు దారి తీసింది. ఈ క్రమంలో గంగరాజుపై సదానందం కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై గంగరాజు..అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు పరిసరాలను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని..సదానందం కుటుంబ సబ్యులకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న సదానందం కోసం గాలిస్తున్నారు. 

గత కొంతకాలంగా గుంతి గంగరాజుకు సదానందానికి సరిహద్దు గోడ విషయంలో జరుగుతున్న వివాదంతో గంగరాజుపై ఆగ్రహానికి గురైన సదానందం హఠాత్తుగా తన ఇంటిలో నుంచి ఏకే 47 తీసుకొచ్చి గంగరాజుపై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. గంగరాజు తప్పించుకోవటంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటనపై గంగరాజు సదానందం పోలీసులకు ఫిర్యాదు చేయగా..కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న సదానందం కోసం గాలిస్తున్నారు. 

దర్యాప్తులో భాగంగా పోలీసులు సదానందం కుటుంబ సభ్యులకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాడు. గొర్రెలను కాచుకుంటూ జీవనం సాగించే సదానందానికి  ఏకే 47 ఎలా వచ్చింది? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.  కాగా ప్రశాంతంగా ఉండే గ్రామంలో  ఏకే 47 కాల్పులు పెను సంచలనం సృష్టించాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు అక్కన్నపేటలో భారీగా మోహరించారు. బృందాలుగా విడిపోయి సదానందం కోసం తీవ్రంగా గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు.

అసలు సదానందానికి ఏకే 47 తుపాకీ ఎక్కడ నుంచి వచ్చింది? సరిహద్దు విషయంలో జరిగిన చిన్న వివాదానికే కాల్పులు జరిపాడా? లేదా దీని వెనుక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో సదానందం కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో అక్కన్నపేట కేసులో స్వాధీనం చేసుకున్న ఏకే-47, కార్బన్ రైఫిల్ పోలీసులవేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయుధాలు మిస్సింగ్‌ విషయంలో తనను కావాలనే ఉన్నతాధికారులు ఇరికించారంటూ రిటైర్డ్ సీఐ భూమయ్య ఆరోపిస్తున్నారు.