Rajasthan : కొత్త మోసం-పెళ్లైన 15 రోజులకు అత్తింటి సొమ్ముతో పరారైన నూతన వధువులు

వయస్సు పెరిగిపోతున్నా పెళ్లికాక ఇబ్బందులు పడుతున్న యువకులను మోసం చేసే ముఠా సభ్యులను రాజస్ధాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు యువకులను పెళ్లి చేసుకున్న యువతులు పెళ్లైన 15 రోజులకు అత్తింటిలోని నగదు, బంగారం, వెండి తీసుకుని పారరయ్యారు. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు తరచుగా వెలుగు చూస్తున్నాయి.

Rajasthan : కొత్త మోసం-పెళ్లైన 15 రోజులకు అత్తింటి సొమ్ముతో పరారైన నూతన వధువులు

marriage fraud

Rajasthan :  వయస్సు పెరిగిపోతున్నా పెళ్లికాక ఇబ్బందులు పడుతున్న యువకులను మోసం చేసే ముఠా సభ్యులను రాజస్ధాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు యువకులను పెళ్లి చేసుకున్న యువతులు పెళ్లైన 15 రోజులకు అత్తింటిలోని నగదు, బంగారం, వెండి తీసుకుని పారరయ్యారు. ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు తరచుగా వెలుగు చూస్తున్నాయి.

వివరాల్లోకి వెళితే ….రాజస్ధాన్‌లోని భరత్‌పూర్ జిల్లాలోని గర్హి బజ్నా ప్రాంతంలోని బైసోరా గ్రామానికి చెందిన రాజేష్ కుమార్ శర్మ, ఆయన సోదరుడు రామేశ్వర్ శర్మకు వయస్సు పెరిగిపోతున్నా పెళ్ళి కావటం లేదు. దీంతో వారి తల్లి కమలాదేవి పెళ్లి సంబందాలు కుదిర్చే ఏజెంట్ కుల్దీప్ జాదవ్ ను సంప్రదించింది. మీ అబ్బాయిలకు పెళ్లి చేయాలంటే నాకు రూ.7 లక్షలు కమీషన్ ఇవ్వాలని షరతు పెట్టాడు. అందుకు ఆమె అంగీకరించటంతో ఉత్తరప్రదేశ్ ఫిరోజాబాద్ కు చెందిన ఇద్దరు మహిళలు ప్రీతి, చాందినీ లతో వారి పెళ్లి ఈ ఏడాది ఫిబ్రవరి 17 న జరిపించాడు.

కొత్త కోడళ్లు ఇద్దరూ అత్తారింటికి కాపురానికి వచ్చారు. కాపురం సజావుగా సాగుతోంది. ఇలా ఉండగా పెళ్లైన 15 రోజులకు మార్చి 5వ తేదీన కొత్త కోడళ్లిద్దరూ అత్తింటి నుంచి పరారయ్యారు. పారిపోయేటప్పుడు అత్తగారింట్లో ఉన్న రూ. 7లక్షల నగదు, ఇంట్లో అందుబాటులో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు తీసుకుని పారిపోయారు.

దీంతో కమాలాదేవి కుమారుడు రాజేష్ కుమార్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఒక మహిళను ఉత్తర ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ లోనూ, మరోకరిని మెయిన్ పురిలోనూ అరెస్ట్ చేశారు.

వీరితో పాటు వీరికి  పెళ్లి కుదిర్చిన ఏజెంట్ కుల్దీప్ జాదవ్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో మహిళలు ఒక్కోక్కరికీ రోజుకు రూ.2 వేలు చొప్పున చెల్లించినట్లు జాదవ్ తెలిపాడు.  వయస్సు పెరిగిపోతున్నా పెళ్లి కాని వ్యక్తులను గాలించి వారికి పెళ్లి చేసి, వారి వద్ద ఉన్న డబ్బు, నగలు దోచుకునే ముఠాలో కుల్దీప్ జాదవ్ పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. కేసు విచారణ కొనసాగుతోంది.

Also Read : GST Officials : జీఎస్టీ అధికారులపై కేసు నమోదు