Viral Video : పబ్‌లో రెచ్చిపోయిన మహిళలు…యువకుడిపై దాడి

ఉత్తర ప్రదేశ్ లోని  లక్నోలో ఒక పబ్ వద్ద యువకుడిపై ఇద్దరు మహిళలు దాడి చేశారు.

Viral Video : పబ్‌లో రెచ్చిపోయిన మహిళలు…యువకుడిపై దాడి

Lucknow Pub Viral Video

Viral Video : ఉత్తర ప్రదేశ్ లోని  లక్నోలో ఒక పబ్ వద్ద యువకుడిపై ఇద్దరు మహిళలు దాడి చేశారు. అందుకు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఈ వీడియోను సుమోటోగా తీసుకున్న పోలీసులు  కేసు నమోదు చేసి వారిద్దరినీ అరెస్ట్ చేసినట్లు లక్నో డిప్యూటీ పోలీసు కమీషనర్ ప్రాచీసింగ్ తెలిపారు.

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని   విభూతి ఖండ్ పోలీసు స్టేషన్ పరిధిలోని   సమ్మిట్ బిల్డింగ్ లోని 15 వ అంతస్తులో అన్ ప్లగ్డ్ కోర్టుయార్డ్ అనే పబ్ ఉంది. దీని వెలుపల గురువారం రాత్రి ఇద్దరు మహిళలు ఒకవ్యక్తిపై దాడి చేశారు.  ఒక మహిళ ఆ వ్యక్తిని ఎడాపెడా…. చితక బాదింది.  అక్కడ అమర్చిన పూల కుండీలతో ఆ వ్యక్తిని కొట్టింది.

ఈ గలాటా చూసిన అక్కడి బౌన్సర్లు ఆవ్యక్తిని   మహిళల బారి నుంచి విడిపించారు.  ఇద్దరినీ చెరో వైపుకు తీసుకు వెళ్లారు. అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు ఈ తతంగాన్ని అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  దీంతో ఈవీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఇది  పోలీసుల దృష్టికి వెళ్లటంతో   పోలీసులు ఈ వీడియోను  సుమోటోగా తీసుకున్నారు. ఆ వ్యక్తిని   కొట్టిన ఇద్దరు మహిళలను గుర్తించి వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. కాగా.. మహిళల దాడిలో దెబ్బలు తిన్న వ్యక్తి ఇంతవరకు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

బహుళ అంతస్తులున్న ఆ భవనంలో పలు పబ్ లు ఉన్నాయి. దీంతో అక్కడ తరచూ గొడవలు జరుగుతూ ఉంటాయి. ఈ నేపధ్యంలో అక్కడ ఒక పోలీసు అవుట్ పోస్టును ఏర్పాటు చేశారు.  కాగా ఆమహిళలు ఇద్దరు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.