ఇళ్లే టార్గెట్ : అంతర్ రాష్ట్ర దొంగలు చిక్కారు

  • Published By: madhu ,Published On : February 17, 2019 / 04:23 AM IST
ఇళ్లే టార్గెట్ : అంతర్ రాష్ట్ర దొంగలు చిక్కారు

నగరంలో మరలా చోరీల ఘటనలు పెరిగిపోతున్నాయి. అంతర్ రాష్ట్రాలకు చెందిన దొంగల ముఠాలు నగరంలో ఎంటర్ అయిపోయారు. వీరు పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. వీరిలో ఓ ముఠాను ఎల్‌బినగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద నుండి 94 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 32 లక్షలు ఉంటుంది. 

వీరి అరెస్టు వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ ఫిబ్రవరి 16వ తేదీ శనివారం వెల్లడించారు. యూపీకి చెందిన భరత్ భూషణ్ భన్సల్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మత్తు ప్రతాప్ వీరిద్దరూ పాత నేరస్తులు. భూషన్ యూపీలో పలు చోరీలు చేయడంతో అక్కడి పోలీసులు గుర్తించారు. దీనితో అతను తన మకాం మార్చేశాడు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశాడు. అప్పటికే జైలులో ప్రసాద్‌తో భూషణ్‌కు పరిచయమైంది. భూషణ్‌కు చెందిన వాహనాన్ని ఇక్కడకు వచ్చే విధంగా చేసుకుని దాని నెంబర్‌ని ఏపీ సిరీస్‌గా మార్చేశాడు.

పలు కాలనీల్లో రెక్కీ నిర్వహించారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యం చేసుకుని చోరీలు చేశారు. ఎల్‌బీనగర్ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువవడంతో పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. వాహనంపై వెళుతున్న వీరిద్దరినీ పోలీసులు గుర్తించారు. అనుమానం వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్‌లను పరిశీలించారు. దాదాపు వీరిపై 45 రోజుల పాటు నిఘా పెట్టారు. ఎట్టకేలకు భూషణ్, ప్రతాప్‌లను అరెస్టు చేశారు. భరత్‌పై 60 కేసులు..ప్రసాద్‌పై కూడా అధిక కేసులున్నాయి. వీరివద్ద 94 తులాల బంగారు ఆభరణాలు, ఓ బైక్, మొబైల్ స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ వెల్లడించారు. కష్టపడి పట్టుకున్న పోలీసు సిబ్బందిని అభినందించారు. పోలీసులకు నగదు రివార్డు ప్రకటించారు.