Murder : మద్యం మత్తులో కత్తులతో దాడి-ఇద్దరు మృతి | Murder

Murder : మద్యం మత్తులో కత్తులతో దాడి-ఇద్దరు మృతి

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నలుగురు వ్యక్తుల మధ్య జరిగిన పోట్లాటలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురైనారు.

Murder : మద్యం మత్తులో కత్తులతో దాడి-ఇద్దరు మృతి

Murder :  పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో నలుగురు వ్యక్తుల మధ్య జరిగిన పోట్లాటలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురైనారు. తాడేపల్లిగూడెం పట్టణం నడిబొడ్డున ఫ్లై ఓవర్ బ్రిడ్జి సమీపంలో ఉన్న శ్రీనివాస మడత మంచముల లాడ్జ్ వద్ద నలుగురు వ్యక్తులు మద్యం సేవించారు. అనంతరం మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులు, మరో ఇద్దరి పై దాడి చేశారు. ఈ దాడిలో  జువ్వల పాలెం కు చెందిన  దొరబాబు( 45) అనే వ్యక్తి రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మరణించాడు.  దొరబాబు రౌడీషీటర్ … గతంలో పలు నేరాలతోసంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read :New Year 2022 : నూతన సంవత్సరం వేళ తప్ప తాగి రోడ్డుపై రచ్చ చేసిన యువతి

మరో వ్యక్తి తాడేపల్లిగూడెం కొబ్బరి తోటకు చెందిన ఎడ్లపల్లి సత్యనారాయణ అలియాస్ మీసాల రాజు (45)ని ఆంబులెన్స్‌లో తణుకు తరలించారు. తణుకులో ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్దకు వెళ్లేసరికి అతను మృతి చెందడంతో మృతదేహాన్నీ తణుకు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ హత్య జరిగినట్లు స్థానికులు అనుకుంటున్నారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

×