ఎట్టా ఇచ్చారు : ఆకాశంలో భూమి.. నకిలీ మనుషులు.. రూ.2 కోట్ల బ్యాంక్ లోన్

కన్నింగ్ గాళ్లు పెరిగిపోతున్నారు. మాటలతోనే మాయ చేస్తున్నారు. కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఎన్నో రకాల ఫ్రాడ్స్ చూసి ఉంటారు, విని ఉంటారు. కానీ

10TV Telugu News

కన్నింగ్ గాళ్లు పెరిగిపోతున్నారు. మాటలతోనే మాయ చేస్తున్నారు. కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఎన్నో రకాల ఫ్రాడ్స్ చూసి ఉంటారు, విని ఉంటారు. కానీ

కన్నింగ్ గాళ్లు పెరిగిపోతున్నారు. మాటలతోనే మాయ చేస్తున్నారు. కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఎన్నో రకాల ఫ్రాడ్స్ చూసి ఉంటారు, విని ఉంటారు. కానీ ఇదో నయా  చీటింగ్ కేసు. జస్ట్ మాటలు చెప్పి ముంచేశారు. రూల్స్, రెగులేషన్స్‌ను పక్కాగా ఫాలో అయ్యే బ్యాంకు అధికారులనే బురిడీ కొట్టించారు. ఏకంగా రూ.2కోట్లు చీటింగ్ చేశారు.
Also Read : సరిదిద్దుకోండి : క్రెడిట్ కార్డుపై చేసే 6 తప్పులు ఇవే

హైదరాబాద్‌లో ఘరానా మోసం వెలుగుచూసింది. బ్యాంకు అధికారులనే కాదు పోలీసులను కూడా షాక్‌కు గురి చేసిన ఫ్రాడ్ ఇది. ఫేక్ కంపెనీ, ఫేక్ ల్యాండ్ పేరుతో చీటింగ్ చేశారు. పోలీసుల  వివరాల ప్రకారం.. శానిటరీ నేప్‌కిన్స్, మెటర్నిటీ ప్యాడ్స్ తయారు చేసే కంపెనీ పేరుతో ఇద్దరు వ్యక్తులు శ్రీకర్, వెంకటేష్ ఘరానా మోసానికి పాల్పడ్డారు. కంపెనీ పెడుతున్నాం రూ.2కోట్లు రుణం  ఇవ్వాలని వారు మహారాష్ట్ర బ్యాంకు అధికారులను కోరారు. ఎస్సార్ నగర్ లో తమకు విలువైన భూమి ఉందని చెప్పారు.

దాన్ని సెక్యూరిటీగా ఉంచి లోన్ ఇవ్వాలని కోరారు. వారి మాటలు నమ్మిన  బ్యాంకు అధికారులు వారిచ్చిన పత్రాలను తీసుకుని రూ.2కోట్లు అప్పుగా ఇచ్చారు. ఎంతకీ రీ పే చెయ్యకపోవడంతో బ్యాంకు అధికారులకు అనుమానం వచ్చింది. వాళ్లు సెక్యూరిటీగా పెట్టిన ల్యాండ్  ను జప్తు చేసుకోవడానికి వెళ్లారు. తీరా ఆ అడ్రస్ కి వెళ్లి చూస్తే అసలు అక్కడ ల్యాండే లేదు. వారి పేరుతో ఎలాంటి ఆస్తులు లేవు. దీంతో నిలువునా మోసపోయామని బ్యాంకు అధికారులు  గుర్తించారు.
Also Read : దబిడిదిబిడే : బాలకృష్ణనే అడ్డుకున్న మహిళలు

వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2019 డిసెంబర్‌లో ఈ ఘటన జరిగింది. ఫిర్యాదు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు 3 నెలల తర్వాత ఈ కేసులో పురోగతి సాధించారు.  మోసానికి పాల్పడిన కేటుగాళ్లు గౌరీ అనిల్ కుమార్, శ్రీనివాస్‌లను అరెస్ట్ చేశారు. వారిని తమ స్టైల్ లో విచారిస్తే అసలు విషయం బయటపెట్టారు. పిసపాటి శ్రీనివాస్ అనే వ్యక్తితో కలిసి తాము  చీటింగ్ కు పాల్పడినట్టు అంగీకరించారు.

బ్యాంకు ఆఫ్ మహారాష్ట్ర జోనల్ మేనేజర్ రాధే శ్యాం బన్సల్ 2018 డిసెంబర్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బేగంపేటకు చెందిన అన్నా ఎకో లాజిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లుగా   శ్రీకర్, వెంకటేష్ అనే ఇద్దరు వ్యక్తులు పరిచయం చేసుకున్నారని, రుణం కావాలని అడిగారని చెప్పారు. ఎస్సార్ నగర్ లో భూమి ఉన్నట్టు చెప్పి లోన్ తీసుకున్నారని వివరించారు. ఆ తర్వాత ఆ రుణాన్ని వారి పర్సనల్ అకౌంట్స్ లోకి ట్రాన్స్ ఫర్ చేసుకుని మాయమైపోయారని తెలిపారు. చీటర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి డబ్బు రాబట్టే పనిలో పడ్డారు.

కాగా.. బ్యాంకు అధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. మరీ అంత గుడ్డిగా వారి మాటలు నమ్మేసి రుణం ఎలా ఇచ్చారు అని ప్రశ్నిస్తున్నారు. ఎలాంటి క్రాస్ చెక్ చేసుకోకుండా, వివరాలు తెలుసుకోకుండా రూ.2కోట్లు లోన్ గా ఇవ్వడాన్ని తప్పుపడుతున్నారు. ప్రతి చిన్న పనికి రూల్స్, రెగులేషన్స్ అనే బ్యాంకు అధికారులు.. అంత పెద్ద ఎమౌంట్ ఇచ్చే ముందు మినిమమ్ జాగ్రత్తలు తీసుకోవాలని తెలియదా అని జనాలు మండిపడుతున్నారు.
Also Read : విదేశాలకు వెళ్తున్నారా : ఎయిర్‌టెల్‌ Foreign Pass రీఛార్జ్ ఆఫర్