Nizamabad : ఇద్దరి ప్రాణాలు తీసిన పంచాయితీ

ధర్మారంకు చెందిన నారాయణ మేనకోడలు.. ఆమె భర్త మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఈనెల 5న నారాయణ మేనకోడలు తరపు బంధువులు.. ఆమె భర్త తరపు బంధువులు కలిసి పంచాయితీ ఏర్పాటు చేశారు.

Nizamabad : ఇద్దరి ప్రాణాలు తీసిన పంచాయితీ

Nizamabad (1)

Two persons killed : ఒకరికి సాయం చేయడానికి వెళ్లాడు.. కానీ అనుకోని విధంగా హత్య కేసులో ఇరుక్కున్నాడు.. ఈ సంఘటన అతని జీవితాన్ని తలకిందులు చేస్తే.. ప్రాణంగా పెంచుకున్న కూతురిని దూరం చేసింది. అసలే తండ్రి అంటే ప్రాణం. వదిలి ఉండలేనంత అనురాగం. కానీ విధి .. ఆ.. తండ్రీ కూతుళ్లను విడదీసింది. తండ్రి ప్రేమకు బిడ్డను శాశ్వతంగా దూరం చేసింది. నాన్న అన్న పిలుపును.. ఇకపై ఆ తండ్రి వినలేని పరిస్థితి తెచ్చింది. ఈ సంఘటన నిజామాబాద్‌ జిల్లా నవీపేట మండలంలో చోటుచేసుకుంది.

ధర్మారంకు చెందిన నారాయణ మేనకోడలు.. ఆమె భర్త మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. దీంతో ఈనెల 5న నారాయణ మేనకోడలు తరపు బంధువులు.. ఆమె భర్త తరపు బంధువులు కలిసి పంచాయితీ ఏర్పాటు చేశారు. అయితే సామరస్యంగా ఓ కాపురం చక్కదిద్దుదామనుకున్న పెద్దమనుషుల మధ్య.. మాటామాటా పెరిగింది. అదికాస్తా కొట్టుకోవడం వరకూ వెళ్లింది. అంతటితో ఆగినా .. నారాయణకు తన బిడ్డ మిగిలేది. కానీ ఆ కొట్టుకోవడం .. చంపేసే వరకూ వెళ్లింది.

East Godavari : కొడుకును కాపాడబోయి తండ్రి మృతి

ఈ దాడిలో తన మేనకోడలు భర్త తరపున పెద్దమనిషిగా వచ్చిన రాజన్న చనిపోయాడు. దీంతో మరికొందరితో పాటు నారాయణపైనా హత్య, హత్యాయత్నం కేసు నమోదైంది. దీంతో తన తండ్రి జైలుకు వెళ్తాడు.. ఇక తనతో ఉండరన్న బెంగతో .. అతని కూతురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కుటుంబ పంచాయితీ ఒకరిదికాగా.. సర్ధిచెప్పేందుకు వెళ్లిన వారిలో ఒకరు మృతి చెందారు.. మరికొంతమంది జైలుకు వెళ్లే పరిస్థితి వచ్చింది. పైగా …. నారాయణ తన కూతురిని పోగొట్టుకోవలసి వచ్చింది. ఈ ప్రాణాలు తీసిన పంచాయితీ .. గ్రామస్తుల హృదయాలను కలచివేసింది.