Porn : షాకింగ్.. పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ 11ఏళ్ల బాలురు.. దానికి ఒప్పుకోలేదని బాలిక హత్య

ఆన్ లైన్ క్లాసుల కోసం మీరు మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారా? అయితే బీ కేర్ ఫుల్. ఫోన్ ఇచ్చే ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు.

Porn : షాకింగ్.. పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ 11ఏళ్ల బాలురు.. దానికి ఒప్పుకోలేదని బాలిక హత్య

Porn Addict Kids

Porn Addict Kids : చక్కగా స్కూల్ కెళ్లి పుస్తకాలు చదువుకోవాల్సిన వయసు. తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన వయసు. ఇలాంటి వయసులో పిల్లలు పెడదోవ పడుతున్నారు. నేరాలు, ఘోరాలకు పాల్పడుతున్నారు. చూడకూడనివి చూసి, చేయకూడని పనులు చేస్తున్నారు. అసోంలో జరిగిన ఓ ఘటన పిల్లల తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక లాంటిది. ఆన్ లైన్ క్లాసుల కోసం మీరు మీ పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారా? అయితే బీ కేర్ ఫుల్. ఫోన్ ఇచ్చే ముందు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం ఉండదు.

Venu Swamy: రకుల్‌కు షాక్.. ప్రేమ విఫలమవుతుందని చెప్పిన వేణుస్వామి!

అసోం నాగన్ జిల్లాలో దారుణం జరిగింది. సభ్య సమాజం ఉలిక్కిపడే ఘటన చోటు చేసుకుంది. ఆన్ లైన్ క్లాసుల కోసమని తల్లిదండ్రులు ఫోన్ ఇస్తే.. ఆ ఫోన్ లో పోర్న్ వీడియోలు చూసేందుకు అలవాటు పడ్డ ఇద్దరు బాలురు దారుణానికి ఒడిగట్టారు. పోర్న్ వీడియోస్ లో తాము చూసిన విధంగా చేయాలని వారు నిర్ణయించారు. పక్కింట్లో ఉండే ఆరేళ్ల బాలికపై వారి కన్నుపడింది. మాయమాటలు చెప్పి బాలికను తీసుకెళ్లిన ఇద్దరు బాలురు… బాలికపై లైంగిక దాడికి యత్నించారు. ఆ వీడియోస్ లో ఎలా ఉందో అలానే తమతో లైంగిక చర్యల్లో పాల్గొనాలని బాలికపై ఒత్తిడి తెచ్చారు.

Sextortion Racket : స్ట్రిప్‌చాట్ పేరుతో రూ.22 కోట్లు మోసం

అయితే అందుకు బాలిక నిరాకరించింది. వారి వింత ప్రవర్తనతో బాగా భయపడింది. అంతేకాదు, ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెబుతానని హెచ్చరించింది. దీంతో భయపడిన బాలురు దారుణానికి ఒడిగట్టారు. రాయితో మోది బాలికను హత్య చేశారు. స్టోన్ క్రిషింగ్ ప్లాంట్ లోని టాయ్ లెట్ లోకి తీసుకెళ్లి బాలికను చంపేశారు. అక్టోబర్ 18న ఈ ఘోరం జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు హత్య చేసిన ఇద్దరు బాలురు, వారికి సహకరించిన 8ఏళ్ల మరో బాలుడిని కూడా అరెస్ట్ చేశారు. వాళ్లు బాలికను హత్య చేస్తుండగా 8ఏళ్ల బాలుడు టాయ్ లెట్ బయట కాపలాగా నిల్చున్నాడు.

ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. ఓ తండ్రి చేసిన తప్పే ఇందుకు ప్రధాన కారణం. ఓ బాలుడి తండ్రి ఫోన్ లో పోర్న్ వీడియోలు ఉన్నాయి. ఆన్ లైన్ క్లాసుల కోసం అని ఆ తండ్రి కొడుక్కి తన ఫోన్ ఇచ్చాడు. అయితే, ఆ బాలుడు వాటిని మరో పిల్లాడితో కలిసి చూడటం అలవాటు చేసుకున్నాడు. అలా అలా.. పోర్న్ వీడియోలకు అడిక్ట్ అయిపోయి దారుణానికి ఒడిగట్టాడు.

WhatsApp: పది రోజుల తర్వాత ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సప్ పని చేయదు.. పూర్తి లిస్ట్ ఇదే!

బుద్ధిగా చదువుకోవాల్సిన పిల్లలు.. పోర్న్ వీడియోలకు అలవాటు పడటం, బాలికను హత్య చేయడం కలకలం రేపింది. తల్లిదండ్రులు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు కొనివ్వడంతో వారి బాధ్యత అయిపోదు. పిల్లలు ఫోన్ లో ఏం చూస్తున్నారు? ఏం చేస్తున్నారు? అనేది నిత్యం గమనించాలి. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే చెక్ చేయాలి. పిల్లలు సరైన మార్గంలో వెళ్తున్నారో లేదో చూసుకోవాల్సి బాధ్యత తల్లిదండ్రులదే.